హైకమాండ్ మూడ్ క్లియర్, కొండా సురేఖ ప్లాన్ బీ - రాజగోపాల్ రెడ్డి సైతం..!?
తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారం కాక రేపుతోంది. తాజాగా ఢిల్లీలో పార్టీ చీఫ్ ఖర్గే తో భేటీ అయిన కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ తో పాటుగా డిప్యూటీ సీఎం భట్టీ సతీమణి.. పొంగులేటి పైన ఆరోపణలు సంధించారు. తన పైన చర్యలు తీసుకోవాలంటే ముందు గా సీఎం రేవంత్ పైనా చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీ కార్డు తెర పైక తెచ్చారు. కాగా, హైకమాండ్ మూడ్ క్లియర్ గా కనిపిస్తోంది. దీంతో.. సురేఖ ప్లాన్ - బీతో సిద్దం అవుతున్నారు. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కీలకంగా మారుతున్నాయి.
కొండా సురేఖ ఢిల్లీ పర్యటనలో హైకమాండ్ మూడ్ గుర్తించారు. తన పైన చర్యలు ఖాయమనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో.. ఢిల్లీ వేదికగానే హైకమాండ్ పైన ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. బీసీ కార్డుతో పాటుగా.. సీఎం రేవంత్.. మంత్రుల పైనా ఆరోపణలు మొదలు పెట్టారు. రేవంత్ పదేళ్లు సీఎంగా ఉంటానని చెప్పటం.. పరకాల సీటు పైన ప్రకటన చేయటాన్ని ప్రశ్నిస్తున్నారు. తన కూతురు వ్యాఖ్యలకు, తనకు సంబంధం లేదని, తనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపడమే తప్పని మరోసారి కుండ బద్దలుగొట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలపై వచ్చిన కమీషన్ల ఆరోపణల మాటేంటని నిలదీశారు. తద్వారా.. మంత్రి పదవికి రాజీనామా చేయాలని తనకు సూచిస్తే.. తాను పార్టీకి భిన్న వైఖరిని తీసుకుంటాననే సంకేతాలకు స్పష్టంగా ఢిల్లీలోనే ఇవ్వటం ఆసక్తిగా మారుతోంది.

హైకమాండ్ నిర్ణయం.. సురేఖ కొత్త వ్యూహం
ఇప్పటికే కొండా మురళీ ప్లాన్ - బీ గురించి వ్యాఖ్యలు చేసారు. తన బిడ్డ సుస్మితా పటేల్ 'ప్లాన్ ఎ'ని అమలు చేసిందని.. ఆమె 'ప్లాన్-బి' ఏమిటో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. కాగా.. కొండా సురేఖ తన పైన వేటు వేస్తే ఏ రకంగా ముందుకు వెళ్లాలో ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం ఉన్నా.. పార్టీలోనే ఉంటూ రేవంత్ ను టార్గెట్ చేస్తూ బీసీ కార్డుతో ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డివర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్లు కాంగ్రెస్ పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నారని.. తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ పాలన తీసుకు వస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఒక రకంగా ఇది రాజగోపాల్‌రెడ్డి ఒత్తిడి వ్యూహమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తు న్నాయి. ఈ క్రమంలో.. అటు ఢిల్లీలో కొండా సురేఖ, ఇటు రాజగోపాల్‌రెడ్డి.. ఒకేసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తో కొండా సురేఖ పై చర్యల తరువాత జరిగే రాజకీయం పైన ఉత్కంఠ నెలకొంది.













Click it and Unblock the Notifications