రేపటి నుంచే కోటీ దీపోత్స‌వం.. టీజీఎస్ఆర్‌టీసీ స్పెష‌ల్ బ‌స్సులు..

కార్తీక మాసం సంద‌ర్భంగా ప్ర‌తి సంవ‌త్స‌రం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటీ దీపోత్స‌వం నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసింది. ఇక‌, ఈ ఏడాది కూడా ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. రేప‌టి నుంచే ఈ కోటి దీపోత్సవం ప్రారంభం కానుంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్రతీ రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. లింగోద్భవం.. వాహనసేవ.. అభిషేకాలు, అర్చనలు.. మఠాధిపతులు, పీఠాధిపతులు వంటివి ఉంటాయి. ఇక, కోటి దీపోత్సవానికి వెళ్లే భ‌క్తుల‌కు ఆర్‌టీసీ ఓ శుభ‌వార్త‌ను అందించించింది. వీటికి స్పెష‌ల్ బ‌స్సుల‌ను నడుపుతోంది.

ప్ర‌తి సంవ‌త్స‌రం నిర్వ‌హించే ఈ కోటి దీపోత్స‌వాల కార్య‌క్ర‌మానికి హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లిరానున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈ కోటి దీపాల వెలుగులు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. కోటి దీపోత్సవం క్ర‌మంలో రేప‌టి (న‌వంబ‌ర్ 9)నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలంగాణ ఆర్‌టీసీ పేర్కొంది. ఇక‌, ఈ స్పెష‌ల్ బ‌స్సులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్‌ సిటీలోని 18 డిపోల నుంచి ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

Koti Dipotsavam from tomorrow TGSRTC special buses

ఈ కోటి దీపోత్స‌వ కార్య‌క్రమాల్లో రాజకీయ నేతలు, ప్రముఖులు ఉపన్యాసానాలు.. ప్రవచనాలు కూడా ఉంటాయి. కార్తీక‌మాసం పుర‌స్కరించుకుని జ‌రిగే ఈ కోటి దీపాల పండుగ భ‌క్తుల‌ను ఎంత‌గానో కట్టి పడేస్తోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుక‌కు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా మారింది. ఈ కోటి దీపోత్సవ కార్య‌క్ర‌మం ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జ‌రుగుతుంది. ఇప్పటికే ఆయా ఛానళ్ల వారు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోటీ దీపాల అలంక‌ర‌ణ‌ల‌తో శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం పరిస‌ర ప్రాంతాల‌న్నీ వెలిగిపోతుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+