సీఎం రమేశ్ సవాల్ స్వీకరించిన కేటీఆర్..! ఇద్దరు సీఎంల కండిషన్ ..!

తెలంగాణ ప్రభుత్వం సీఎం రమేశ్ కు రూ.1600 కోట్ల కాంట్రాక్టుల్ని నామినేషన్ పద్ధతిపై కేటాయించిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలకు ఇవాళ ఆయన స్పందించి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పై తీవ్ర స్వరంతో రెచ్చిపోయిన సీఎం రమేశ్.. ఆయన ఆరోపణల్ని తోసిపుచ్చారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ ను కేటీఆర్ కొద్దిసేపటి క్రితం స్వీకరిస్తూ ట్వీట్ చేశారు.

దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతున్నదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి ₹ 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టు ఇచ్చిందని,
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కు ₹ 1660 కోట్ల రోడ్ కాంట్రాక్టు..ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు.
ఇంతకన్నా దిగజారుడు రాజకీయం.. దౌర్భాగ్యపు దందా ఇంకోటి ఉంటదా అని ప్రశ్నించారు.

ktr accepts cm Ramesh s challenge says ready for debate if come along with cm revanth

సీఎం రేవంత్.. .సీఎం రమేశ్ ఇద్దరి బాగోతం తాను బయటపెట్టడంతో కుడిదిలో పడిన ఎలుకలా ఇద్దరూ కొట్టుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు అట.. దానికి 1660 కోట్ల కాంట్రాక్టు అట... అని వ్యాఖ్యానించారు.
హెచ్సీయూ భూములు తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్న.. లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారన్నారు. తాను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైందన్నారు. దొంగతనం బయటపడటంతో.. అటెన్షన్ డైవర్షన్ కు పనికి రాని కథలు చెబుతున్నారన్నారు.

ktr accepts cm Ramesh s challenge says ready for debate if come along with cm revanth

రూల్స్ ను బ్రేక్ చేయడం.. కాంట్రాక్టును అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. నీ (సీఎం రమేశ్ ) దోస్తు 10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్.. 1660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయిందన్నారు. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పస లేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నరు.

తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తాము ఇరకాటంలో పడిన ప్రతిసారి, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ పనికి రాని చెత్త అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను కన్ ఫ్యూచ్ చేయాలని చూస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. సీఎం రమేష్ - సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే.. హెచ్సీయూ ₹ 10000 కోట్ల స్కాం పైనా.. 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కాంపై.. రెండిటిపైనా కలిసి చర్చ కు సిద్ధమని కేటీఆర్ తేల్చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+