అంబానీ, అదానీలకు రుణమాఫీ..తప్పని నిరూపిస్తే రేపే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా: కేటీఆర్ సవాల్

తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంది. ఒకరి మీద ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక నిన్నటిదాకా రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాళ్ల పర్వం కొనసాగితే, నేడు బిజెపినేతలైన బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.

బడా కార్పొరేట్లకు రుణమాఫీ ఎలా చేశారు?
బడా కార్పొరేట్లు అయిన అదాని, అంబానీలకు 14న్నర లక్షల కోట్ల రూపాయల రుణాలను ప్రధాని నరేంద్ర మోదీ మాఫీ చేయలేదని, బండి సంజయ్, కిషన్ రెడ్డి రుజువు చేస్తే రేపే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. మేడే సందర్భంగా తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఉచితాలు ఇస్తే ప్రధానమంత్రి మోదీ అనుచితం అంటారని, కానీ బడా కార్పొరేట్లకు రుణమాఫీ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు.

KTR challenge to bandi sanjay kishan reddy over ambani adani loan waiver slams revanth reddy

రాజకీయాల కోసం మతాన్ని వాడుకున్నామా
బడా కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం రుణమాఫీ చేసిన డబ్బు పదేళ్ళ పాటు దేశం మొత్తం రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి పనికొచ్చేది అని అన్నారు. తాము రాజకీయాల్లో ఎప్పుడైనా మతాన్ని వాడుకున్నామా చెప్పాలని ప్రశ్నించిన కేటీఆర్, తాము అత్యంత అద్భుతంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని నిర్మించామని, కానీ దానిని రాజకీయాల కోసం వాడుకోలేదన్నారు.

మోదీ దేనికి దేవుడు.. మాట్లాడితే జై శ్రీరామ్ దేనికి
బిజెపి నేతలు మాట్లాడితే జైశ్రీరామ్ అంటూ అయోధ్య అంశాన్ని తెరమీదకు తెస్తారని, అయోధ్య పేరుతో కూడా రాజకీయం చేస్తారని విమర్శించారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న వారు చేసిన పనిని చెప్పుకోలేని దద్దమ్మలు బిజెపి నేతలని విమర్శించారు. మోదీని బిజెపి నేతలు దేవుడు అంటున్నారని, అసలు మోదీ దేనికి దేవుడని ప్రశ్నించారు. కరోనా లాక్డౌన్ సమయంలో కర్షకులు, కార్మికులను చావగొట్టినందుకా మోదీ దేవుడన్నారు.

మోదీకి ఇందుకేనా ఓటెయ్యాలి
సెస్ ల పేరుతో ప్రజల తోలు పిండి 30 లక్షల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా మోదీకి ఓటెయ్యాలి అన్నారు. మోడీకి బడా పారిశ్రామికవేత్తలు తప్ప సామాన్యులు కనిపించరని, అందుకే వారికి రుణమాఫీ చేశారన్నారు. తాను చెప్పింది అబద్ధం అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపాటు
ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసిన కేటీఆర్ తెలంగాణలో కేసీఆర్ ను లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మతో కూడా కాదని కేటీఆర్ తేల్చి చెప్పారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణా నే లేకుండా చేయాలన్నారు. అది జరిగేది కాదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+