వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి కేటీఆర్ నాలుక వాడుడు వ్యాఖ్యలు; అందుకే వాడతారంటూ కాంగ్రెస్; సోషల్ మీడియాలో రచ్చ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ మాటల యుద్ధాన్ని కొనసాగిస్తుంది. టిఆర్ఎస్ లక్ష్యంగా తన దూకుడును చూపిస్తుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పర్యటన రాజకీయ సెగలు పుట్టిస్తోంది. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో అంత సీన్ లేదంటూనే మంత్రి కేటీఆర్ రాహుల్ పర్యటనను టార్గెట్ చెయ్యటం ఆసక్తిని రేకెత్తించింది. అప్పుడు మొదలైన మాటల యుద్ధం, రెండు పార్టీ నేతల మధ్య నేటికీ కొనసాగుతూనే ఉంది.

డోస్ పెంచి తిట్టి.. నాలుక వాడగలమన్న మంత్రి కేటీఆర్

డోస్ పెంచి తిట్టి.. నాలుక వాడగలమన్న మంత్రి కేటీఆర్

రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మరోపక్క బీజేపీని సైతం ఏకిపారేస్తున్నారు. నోటికొచ్చింది తిట్టిపోస్తున్నారు. మోడీ బట్టే బాజ్ అనలేమా అంటూ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఇక రేవంత్ రెడ్డి ని, రాహుల్ గాంధీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని పొలిటికల్ టూరిస్టు అంటూ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. వాడు, వీడు, చిల్లర నాయాళ్ళు అంటూ విరుచుకుపడ్డారు. నాలుక వాడుడు మొదలుపెడితే మా కంటే ఎవరు బాగా వాడలేరంటూ విమర్శలు గుప్పించారు. తాము కూడా నోటికొచ్చింది తిట్టగలమని డోస్ పెంచి మరీ విరుచుకుపడ్డారు.

కేటీఆర్, కేసీఆర్ నాలుక వాడేది అందుకే అంటూ టార్గెట్

కేటీఆర్, కేసీఆర్ నాలుక వాడేది అందుకే అంటూ టార్గెట్

ఇక మంత్రి కేటీఆర్ నాలుక వాడుడు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నేతలకు టార్గెట్ అవుతున్నాయి. టి పి సి సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్, కెసిఆర్ లు నిజంగానే నాలుకని బాగా వాడతారని, కెసిఆర్ ఢిల్లీలో బీజేపీ నాయకుల బూట్లు నాకడానికి, కేటీఆర్ సినిమా వాళ్ళ సంక నాకడానికి నాలుకను బాగా వాడతారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఇద్దరి మాటలు మాటకు మాట అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రి కేటీఆర్ ను తాజా వ్యాఖ్యల నేపధ్యంలో బాగానే టార్గెట్ చేస్తున్నారు.

ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం ... ఆస్తుల లెక్క అడిగిన మాణిక్కం ఠాకూర్

ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం ... ఆస్తుల లెక్క అడిగిన మాణిక్కం ఠాకూర్

ఇదే సమయంలో తాజాగా రాష్ట్ర మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ వేదికగా ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రాష్ట్ర ప్రజల నుండి అనేక ప్రశ్నలు వచ్చాయి. వాటికి స్పందించిన కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇక ఆస్క్ కేటీఆర్ కు స్పందించిన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ సెటైర్లు వేశారు. కేటీఆర్ ఆస్తులు పెంచుకోవడం లో ఉన్న రహస్యం ఏంటో చెప్పాలంటూ మాణిక్కం ఠాకూర్ కేటీఆర్ ను ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ఆస్తులకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ రాష్ట్ర ప్రజలను ఆలోచించేలా చేశారు.

కేటీఆర్ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయో చెప్పాలని ప్రశ్న

కేటీఆర్ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయో చెప్పాలని ప్రశ్న

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్లో తనకు 7 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారని, 2018 వచ్చే సరికి కేటీఆర్ ఆస్తులు 41 కోట్లకు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. 2018 నుండి 2023 వరకు టార్గెట్ ఎంత అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గట్టిగానే అధికార టీఆర్ఎస్ పార్టీని, మంత్రి కేటీఆర్ ను, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తుందని తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా టిఆర్ఎస్ పార్టీకి బలమైన పోటీని ఇచ్చే అవకాశం లేకపోలేదు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

English summary
The Congress party has been furious on social media over Minister KTR's tongue using remarks. The Congress is targeting the CM KCR for using his tongue for BJP leaders shoes licking and KTR using his tongue for cinema people under arms lick licking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X