వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనిధిపై చాలా ట్వీట్లు వచ్చాయి, చర్చిస్తా: విద్యార్థుల ట్వీట్‌పై కేటీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపుపై శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు కొందరు మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు వరుసగా ట్వీట్లు చేశారు. కాలేజీలో ఫీజులు విపరీతంగా పెరుగుతున్నాయని వాపోయారు. దీనిపై కేటీఆర్ స్పందించారు.

శ్రీనిధి కళాశాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు గత నాలుగైదు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. కాలేజీ ఫీజు అధికంగా వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని సోషల్ మీడియా వేదికగా కూడా విద్యార్థులు కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు.

KTR to discuss SNIST fee row with Kadiyam Srihari

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. శ్రీనిధిలో ఫీజు పెంపుల విషయమై చాలా ట్వీట్లు వచ్చాయని, తాను ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చిస్తానని తెలిపారు. తమ సమస్యపై స్పందించిన కేటీఆర్‌కు విద్యార్థులు థ్యాంక్స్ చెప్పారు.

అంతకుముందు శ్రీనిధి విద్యార్థుల పేరుతో.. కేటీఆర్ సర్, మీరు మా సమస్యపై స్పందించారని, చాలా న్యూస్ ఛానల్స్ మా కాలేజీకి వచ్చాయని, కానీ వారెవరు కూడా దానిని టెలికాస్ట్ చేయడం లేదని, మా కాలేజీ మేనేజ్‌మెంట్ రూ.97,000 ఉన్న ఫీజుకు రూ.1,37,000 తీసుకుంటుందని పేర్కొన్నారు.

కేటీఆర్ సోషల్ మీడియాలో వివిధ సందర్భాల్లో పలు అంశాలపై ట్వీట్ చేశారు. ఫిఫా వరల్డ్ కప్ గురించి కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆదివారం వజ్రం అనే నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. మీరు సహాయం చేసి మా పాపకు మళ్లీ జీవం పోశారని పేర్కొన్నారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ యూ మేడ్ మై డే అని స్పందించారు. దీనికి చాలామంది నెటిజన్లు స్పందిస్తూ.. డైనమిక్ లీడర్, చాలామంది పని చేశారు.. అంటూ ప్రశంసించారు.

English summary
IT Minister K Tarakarama Rao on Saturday said that he would discuss with Education Minister Kadiyam Srihari about the fee hike row in Sreenidhi Institute of Science and Technology (SNIST), Ghatkesar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X