Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ రెండంటే ఎందుకంత చిరాకు, కోపం?: రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక

తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించబోమని, పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా ప్రభుత్వ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు.

తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు కేటీఆర్. ఇదేం రెండు నాల్కల వైఖరి? ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన అంటూ ఎక్స్(ట్విట్టర్)​ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం? చార్మినార్​ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని సీఎం రేవంత్​ రెడ్డిని కేటీఆర్​ నిలదీశారు. అవి రాచరికపు గుర్తులు కావని, వెయ్యేళ్ల సాంస్కృతిక వైఖవానికి చిహ్నాలు అని చెప్పుకొచ్చారు.

KTR fires at CM Revanth Reddy for telangana emblem changing issue

ఆ రెండు వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా అని ప్రశ్నించారు. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అనీ, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్​ అని తెలిపారు. అధికారిక గీతంలో కీర్తించి! అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు.

చార్మినార్​ అంటే ఒక కట్టడం కాదని విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్‌​కు ఐకాన్​ అన్నారు కేటీఆర్. కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదని సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకమని కేటీఆర్​ వివరించారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడమంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అని కేటీఆర్​ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమేనని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ పాలిస్తున్న కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికపు గుర్తులున్నాయన్నారు. మరి వాటిని కూడా తొలగిస్తారా, లేదా చెప్పాలంటూ ప్రశ్నించారు.

'భారత జాతీయ చిహ్నంలోనూ.. అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి..జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది.. వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి..??' అని కేటీఆర్ నిలదీశారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ?ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ? అని మండిపడ్డారు.

ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు.. రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా..? గత పదేళ్లుగా..ప్రభుత్వ అధికారిక చిహ్నంపై.. యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది.. సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది.. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో.. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించం. పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా... మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం..! తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం.. అంటూ హెచ్చరించారు.

పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన'ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటె అది రాచరిక పోకడనట

కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి "గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్" అని పాడుకోవాలి !!?? "కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప" అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి !!?? అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా ?' అని కేటీఆర్ ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+