గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలు: కన్ఫ్యూజన్‌లో కేటీఆర్
హైదరాబాద్: సోమవారం వెలువడుతున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తనను గందరగోళానికి గురిచేస్తున్నాయని తెలంగాణ మంత్రి కేటీఈర్ వ్యాఖ్యానించారు. మొదట బీజేపీ, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత మళ్లీ బీజేపీ రావడంతో ఆయన కన్ఫ్యూజ్ అయినట్లు తెలిపారు.
కాగా, ప్రస్తుతం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటి అధికారాన్ని చేపట్టే దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు తనను గందరగోళానికి గురిచేస్తున్నాయని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

'గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఒక్కో ఛానెల్ ఒక్కో విధంగా ఆధిక్యం చూపుతూ కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. వారి అభిప్రాయాలు, ఇతర విషయాలను నేను అర్థం చేసుకోగలను. అయితే నిజాలు, సంఖ్యలు ఎలా మారతాయి' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
అయితే, మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై కొందరు నెటిజన్లు సరదాగా స్పందించారు. కొందరు టీవీ స్విచ్ఛాప్ చేసుకోమని సలహా ఇస్తే.. మరికొందరు ఛానెళ్లను ఫాలో కావొద్దని సూచించారు. మొదట కాంగ్రెస్ వాళ్లు సంబరాలు చేసుకున్నారని, ఇప్పుడు బీజేపీ వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాగా, కేవలం ఎన్నికల సంఘం ఫలితాలను ఫాలో అయితే కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదని మరికొందరు ఇంటెలిజెంట్ నెటిజన్లు సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications