రాహుల్, ఖర్గేకు కేటీఆర్ లేఖ - బిగ్ టర్న్..!!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్, ఖర్గేకు లేఖ రాసారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ గుర్తు చేస్తూ..అమలులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే వారి తరఫున కాంగ్రెస్ పార్టీపై పోరాడతామని ఆ లేఖ ద్వారా హెచ్చరించారు.
హామీ ఇచ్చారు
కేటీఆర్ తన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారని గుర్తు చేసారు. కానీ ఈ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. 40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం 17 వేల కోట్ల రుణమాఫీతో రైతులను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతులందరికీ రుణమాఫీ చేయాలని తన లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు.

రైతలకు మోసం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యాలతో ముఖ్యంగా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ మోసం వలన లక్షలాదిమంది రైతులు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారున్నారు. కనీసం 40 శాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండానే వందశాతం రుణమాఫీ పూర్తయిపోయిందని ప్రకటించడం వందకు వందశాతం అబద్ధంగా పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లక్షరూపాయల రుణమాఫీ చేస్తేనే 17 వేల కోట్లు ఖర్చయిందని..ఏకంగా 36 లక్షల మంది రైతులు రుణవిముక్తులై లబ్ది చేకూరిందన్నారు.
పోరాటం చేస్తాం
కాంగ్రెస్ చెబుతున్నట్టు రెండు లక్షల రుణమాఫీ పూర్తయితే.. లబ్దిదారుల సంఖ్యతోపాటు రుణమాఫీ మొత్తం పెరగాలి, దాదాపు రెట్టింపు కావాలి. కానీ కేవలం 17,900 కోట్లతో రెండు లక్షల రుణమాఫీని పూర్తిచేశామనడం ముఖ్యమంత్రి డొల్లవాదనకు నిదర్శనమన్నారు. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికి తూతూమంత్రంగా చేయడం.. కాంగ్రెస్ సర్కారు అసమర్థతకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని ఆరోపించారు. 40 శాతం కూడా రుణమాఫీ చేయకుండా.. లక్షలాది మంది రైతులను నట్టేట ముంచి ప్రక్రియ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేయడంతో.. యావత్ తెలంగాణ ఇవాళ రైతుల ఆందోళనలతో అట్టుడుకుతోందని కేటీఆర్ లేఖలో వివరించారు.












Click it and Unblock the Notifications