నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ చేయరు, ఆ తరువాత..!!
కేటీఆర్ కేసులో నెక్స్ట్ జరిగేది ఏంటి. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వటంతో త్వరలో అరెస్ట్ ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్ అంచనా. ఇప్పటికే ఏసీబీ ఎదుట కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. దీంతో.. తాజా పరిణామాల పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. అదే విధంగా ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ల విచారణ.. ఉప ఎన్నికల పైన కేటీఆర్ కీలక అంశాలను వెల్లడించారు. తన అరెస్ట్ పై సీఎం రేవంత్ ఆలోచనను విశ్లేషించారు.
ర్ములా ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతించారు. తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతిపై కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చేసుకుపోనివ్వండన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌లో తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహరంపై లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. తాము మళ్ళీ ప్రభుత్వం లోకి వస్తామని.. అన్ని లెక్కలు తేలుస్తామన్నారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని.. అరెస్ట్ జరగదని ధీమా వ్యక్తం చేశారు. అందులో ఏమీ లేదని రేవంత్‌కు కూడా తెలుసన్నారు.

కాగా, దానం నాగేందర్‌తో రాజీనామా చేయించి..కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దానం దొరికిపోయారన్నారు. అనర్హత వేటు పడితే ఇజ్జత్ పోతుందని రాజీనామా చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సాంకేతిక సాకులు చూపి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ ఎన్నికలు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని మాజీ మంత్రి ఆరోపించారు.
LIVE: BRS Working President @KTRBRS addressing the media at Telangana Bhavan https://t.co/leIiEDf7gn
— BRS Party (@BRSparty) November 21, 2025
9,292ఎకరాల ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టేయబోతున్నారన్నారు. రేవంత్ భూకుంభకోణంపై బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. అయితే బీజేపీ కూడా కుంభకోణంలో భాగమని... అందుకే స్పందించడం లేదని విమర్శించారు. తన కేసులో విచారణకు గవర్నర్ అనుమతి అవసరం లేకపోయినా పంపారని చెప్పారు. గవర్నర్ లీగల్ ఒపీనియన్ కు పంపటంతో ఆలస్యం అయిందని.. ఈ కేసు ఇలాగే కొనసాగుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications