కొండా సురేఖకు మళ్ళీ కేటీఆర్ మాస్ వార్నింగ్!
మంత్రి కొండా సురేఖపై మరొకమారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. తన క్యారెక్టర్ పై చేస్తున్న నిరాధార ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు తాను ఒక నిర్ణయానికి వచ్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ తనపై చేసిన దురుద్దేశపూర్వకమైన, చౌకబారు వ్యాఖ్యలపైన తాను 100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్టు పేర్కొన్న కేటీఆర్ నిరాధార ఆరోపణలపైన న్యాయపోరాటం చేస్తానని తేల్చి చెప్పారు.
ఇది వారికి గుణపాఠం అవుతుంది : కేటీఆర్
సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. తాను కోర్టులో నిజం గెలుస్తుందని నమ్ముతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. కానీ వేసిన ఈ వ్యాజ్యం చౌకబారు వ్యాఖ్యలు చేసే వారికి గుణపాఠం అవుతుందని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.

ఇది గీత గీయాల్సిన సమయం
ఒక ప్రజా ప్రతినిధిగా తాను ఎల్లప్పుడూ వ్యక్తిగత వివాదాల కంటే ప్రజల సమస్యల పరిష్కారానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చానని, ఇస్తానని కానీ ప్రస్తుతం వ్యక్తిగత వ్యాఖ్యలు చేసే వారికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వచ్చిందని, ఒక గీత గీయాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శల పేరుతో చౌకబారు వాక్చాతుర్యాన్ని ప్రదర్శించే వాళ్లకు ఇది ఒక లెస్సన్ అవుతుందని తాను భావిస్తున్నట్లుగా కేటీఆర్ పేర్కొన్నారు.
వ్యక్తిగత విమర్శలు సహించేది లేదన్న కేటీఆర్
ఎట్టి పరిస్థితులలోను ఇటువంటి వ్యక్తిగత విమర్శలు సహించేది లేదని లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడిన విషయం తెలిసిందే. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేస్తున్నట్టు జడ్జి శ్రీదేవి ప్రకటించారు.
I've taken a firm stand against baseless allegations and cowardly personal attacks on my character. I have filed a ₹ 100 crore defamation suit against Minister Konda Surekha garu for her malicious and cheap comments
— KTR (@KTRBRS) October 22, 2024
For far too long, these attacks & attempts to indulge in…
మంత్రి కొండా సురేఖ 23న కోర్టుకు
ఈ కేసులో రేపు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు సాక్షులుగా బీఆర్‌ఎస్ నేతలు ఉన్న తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్ సాక్షాలను సైతం కోర్టు నమోదు చేయనున్నది. కాగా, సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సంజాయిషీ చెప్పుకునేందుకు మంత్రి కొండా సురేఖ 23న కోర్టుకు హాజరుకానున్నారు. అదేరోజు ఆమె కేటీఆర్ పిటిషన్‌పై కూడా సంజాయిషీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications