కేసీఆర్ కు సిట్ నోటీసుల పై బీఆర్ఎస్ కీలక నిర్ణయం...!!
తెలంగాణలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్ కు సిట్ నోటీసుల వ్యవహారం సంచలనంగా మారుతోంది. కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ హాజరు పైన ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పందన లేదు. అయితే, కేసీఆర్ సిట్ విచారణకు హాజరు వేళ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. కీలక చర్చలు జరుగుతున్నాయి. సిట్ నోటీసులు.. విచారణ పైన మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.
సిట్ మరో సారి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని సిట్ స్పష్టం చేసింది. అయితే, న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుస మంతనాలు సాగిస్తున్నారు. నోటీసు జారీ చేసిన తీరు పైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు చెల్లవనే వాదన తెర మీదకు తెస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ హాజరు పైనా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా.. ఈ పరిణామాల పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు...'తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి.. పైశాచిక ఆనందం పొందడం దారుణం' అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

హాజరవుతారా.. సమయం కోరుతారా
దీనికి కొనసాగింపుగా ఇది కేవలం 'పైశాచిక ఆనందం' పొందడమేనని కేటీఆర్ విమర్శించారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారు ఉంటున్న నివాసం వద్దే విచారించాలనే కనీస నిబంధనను పోలీ సులు అతిక్రమిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) మీద అవగాహన ఉందా? లేక ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మల్లా మారి ప్రతిపక్షాలను వేధించ డమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. చట్టం, న్యాయంపై తమకు పూర్తి విశ్వాసం ఉంద ని, అక్రమ కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి చేస్తోన్న ప్రతి తప్పుడు పనిని ప్రజల ముందు పెడతామని, సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. దీంతో.. కేసీఆర్ మరోసారి సమయం కోరే అవకాశం ఉందనే అభిప్రాయం గులాబీ పార్టీ నేతల నుంచి వ్యక్తం అవుతోంది. కాగా.. కేసీఆర్ విచారణకు వస్తారా.. సమయం కోరుతారా.. మర సారి సమయం కోరితే సిట్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠను పెంచుతోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications