వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100 శాతం జడ్పీలను కైవసం చేసుకోవడం దేశ చరిత్రలోనే అతిపెద్ద విజయం :కేటీఆర్

|
Google Oneindia TeluguNews

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి మరోసారి సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలు విశ్వాసం ఉంచారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ అన్నారు. ఈసంధర్భంగా తీర్పు ప్రజలకు పాదాభివందనాలు తెలిపారు. కాగా ఈ గెలుపు ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చిన బాధ్యత అని పేర్కోన్నారు. గత చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని అయన అన్నారు.
కాగా స్థానిక సంస్థల గెలుపు టీఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

ఇది ప్రజలు ఇచ్చి భాద్యత ...కేటీఆర్

ఇది ప్రజలు ఇచ్చి భాద్యత ...కేటీఆర్

కాగా అయన మీడీయా మాట్లాడుతూ టీఆర్ఎస్ గెలిచినా...ఓడినా ఒకే తీరుగా ఉంటామని స్సష్టం చేశారు. కాగా పార్లమెంట్ ఎన్నికల తర్వత ప్రతిపక్షాలు పలురకాలుగా మాట్లాడరని, కాని ప్రజలు టీఆర్ఎస్‌కు అనుగుణంగా ఏకపక్ష తీర్పును ఇచ్చారని అన్నారు. ఈనేపథ్యంలోనే ప్రత్యర్థులు 12 జిల్లాల్లో కనీసం ఖాత కూడ తెరవలేక పోయారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో 99 స్థానాలను గెలుచుకున్నామని ఇప్పుడు కూడ జడ్పీ స్థానాలను వంద శాతం కైవసం చేసుకుంటున్నామని, ఎంపీటీసీ ఫలితాల్లో 90 శాతం స్థానాలు గెలుచుకున్నామని చెప్పారు.

పార్లమెంట్‌లో ఓటమీ... స్థానిక సంస్థల్లో గెలుపు

ఇక పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్థానాలు గెలుచకోవాలని భావించిందని కాని ప్రజలు ఎమనుకున్నారో తెలియదు కాని కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్ ఓటమీ పాలయిందని అన్నారు. అయితే పార్లమెంట్‌కు ఎన్నికలు జరిగిన తర్వాత పదిహేను రోజుల్లోనే ప్రజలు తిరిగి పట్టం కట్టారని అన్నారు. ఈనేపథ్యంలోనే నిజామాబాద్,కరీంనగర్‌తోపాటు ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 100 శాతం విజయం సాధించిందని తెలిపారు.అయితే 15 రోజుల్లో ప్రజలు ఏ మార్పు కోరుకున్నారో సమీక్ష జరుపుతామని అన్నారు.కాగా నిజమాబాద్‌లోని 27 జడ్పీటీసీలకు గాను 23 జడ్పీటీసీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

జడ్పీ స్థానాలను స్వీప్ చేసిన టీఆర్ఎస్

జడ్పీ స్థానాలను స్వీప్ చేసిన టీఆర్ఎస్

కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం 538 జడ్పీ స్థానాల్లో టీఆర్ఎస్ ఇప్పటి వరకు 473 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ పార్టీ 73 స్థానాల్లో గెలుపోందింది. ఇక పార్లమెంట్ స్థానాల్లో నాలుగు స్థానాలకు ఎగబాకిన బీజేపీ కేవలం 7 జడ్సీ స్థానాలకే పరిమితమైంది. ఇక 5817 స్థానాలకు గాను 3600 ఎంపీటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 1377 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.బీజేపీ 211 స్థానాలు గెలుచుకోగ ఇతరులు 600 స్థానాలను గెలుచుకున్నారు.

English summary
Telangana Rashtra Samithi (TRS) continued it winning streak in local body polls in statewide result,and KTR thanked the people for reposing faith in TRS party and the Chief Minister K Chandrashekhar Rao. Also said that victory is the record in trs party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X