Telangana gateway: కండ్లకోయలో రూ. 100 కోట్లతో ఐటీ పార్క్, 17న కేటీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గేట్ వే పేరిట 10 ఎకరాల్లో రూ. వంద కోట్లతో నిర్మించనున్నారు. దాదాపు వంద సంస్థలకు కేటాయించనున్నారు.

100 కోట్లతో కండ్లకోయలో ఐటీ పార్క్
ఈ పార్కు ద్వారా 50వేల మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజైన 17న దీనికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.హైదరాబాద్‌కు నలువైపులా ఐటీ అభివృద్ధిలో భాగంగా దీనిని అవుటర్ రింగ్‌రోడ్డు వద్ద చేపడుతున్నారు. అత్యంత ఎత్తైన కొత్త ఐటీ పార్కు ఏర్పాటు కోసం గత కొన్నేళ్లుగా స్థలాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం కండ్లకోయ వైపు మొగ్గు చూపింది. అంతర్జాతీయ విమానాశ్రయానికి 45 నిమిషాల్లో చేరుకునే సౌకర్యంతో పాటు రహదారుల అనుసంధానం వంటి వాటిని సానుకూలంగా భావించింది ప్రభుత్వం. కండ్లకోయ జంక్షన్ వద్ద స్థల ఎంపిక పూర్తికావడంతో నిర్మాణ ప్రణాళికను సర్కారు సిద్ధం చేసింది. బాధ్యతలను టీఎస్‌ఐఐసీకి అప్పగించింది. ఇప్పటికే 70కి పైగా సంస్థలు కార్యాలయ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ పార్కులో సమావేశ మందిరాలు, భారీ పార్కింగు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఐటీ పార్కు ప్రత్యేకతలను గమనించినట్లయితే.. 14 అంతస్తుల్లో నిర్మాణం (రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎత్తైంది)ఎత్తు, 40 మీటర్లుకార్యాలయ స్థలం, 5 లక్షల చదరపు అడుగులు.
జెన్ ప్యాక్ట్ విస్తరణ.. తూర్పు హైదరాబాద్‌లో లక్ష మందికి ఉద్యోగాలు
మరోవైపు, హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో జెన్ ప్యాక్ట్ విస్తరణకు మంత్రి మల్లారెడ్డితో కలిసి ఐటీ మంత్రి కేటీఆర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. తూర్పు హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. జెన్ ప్యాక్ట్ విస్తరణ పూర్తయితే లక్ష లక్ష్యానికి సమీపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. జెన్ ప్యాక్ట్ సంస్థకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. జెన్ ప్యాక్ట్ వరంగల్ లోనూ విస్తరించనున్నట్లు తెలిపారు.
పశ్చిమ హైదరాబాద్‌కు ధీటుగా తూర్పు హైదరాబాద్
తూర్పు ప్రాంత అభివృద్ధి కోసం నాగోల్‌లో శిల్పారామం ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ ప్రాంతంలోనే ఉందని తెలిపారు. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు, ఉప్పల్ జంక్షన్ లోనూ స్కైవాక్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. పశ్చిమ హైదరాబాద్‌కు ధీటుగా తూర్పు హైదరాబాద్ ఎదుగుతోందన్నారు. ఇక్కడ ఐటీ పార్కుల నిర్మాణానికి డెవలపర్లు ముందుకొస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications