పాలనలో కేటీఆర్ స్పీడ్: ట్వీట్‌పై స్పందన, చెత్త తొలగింపు..!
హైదరాబాద్: తెలంగాణ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ పాలనలో దూసుకెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, దానిపై జీహెచ్ఎంసీ అధికారుల స్పందిస్తున్న తీరును ఆన్‌లైన్‌లో పర్యవేక్షణకు కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా మంగళవారం చెత్తపై ఓ యువకుడి ఫిర్యాదుపై కేవలం గంటలో స్పందించి ఔరా అనిపించారు. వివరాల్లోకెళితే... నగరంలోని ట్రూప్ బజార్‌కు చెందిన విశాల్ తులి అనే యువకుడు చెత్తపై మంత్రి కేటీఆర్‌తో పాటు జీహెచ్ఎంసీ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ ఫిర్యాదును పోస్ట్ చేశారు.

తమ ప్రాంతంలోని నవరంగ్ కాంప్లెక్స్, ఎలక్ట్రిక్ మార్కెట్ వద్ద పేరుకుపోయిన చెత్త ఫొటోలను అందులో పోస్ట్ చేశారు. దీనిపై కేటీఆర్ వేగంగా స్పందించారు. వెంటనే అక్కడి చెత్తను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన పారిశుద్ధ్య కార్మికులు అక్కడి చెత్తను గంటలో ఎత్తేశారు.
దీనిని గమనించిన విశాల్ తులి... చెత్తను ఎత్తివేసిన తర్వాత అక్కడి ఫొటోలను మరోమారు తీసి వాటిని తిరిగి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి... వేగంగా స్పందించినందుకు మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు.
You are welcome sir https://t.co/RTiiYA6HI3
— KTR (@KTRTRS) 12 April 2016
Will resolve https://t.co/Y5GWNdW5L8
— KTR (@KTRTRS) 12 April 2016
Agree absolutely https://t.co/AHz5znYSdq
— KTR (@KTRTRS) 12 April 2016
We are, very soon. https://t.co/ZDJGVCQFIV
— KTR (@KTRTRS) 11 April 2016












Click it and Unblock the Notifications