వరద బాధితులకు కుమారీ ఆంటీ విరాళం.. మెచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి!
కుమారి ఆంటీ.. తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు ఉండరు కావచ్చు. హైదరాబాద్లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ జనాలకు తన వంటకాలను రుచి చూపిస్తూ బిజినెస్ చేసిన కుమారీ ఆంటీ సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా ఫేమస్ సెలబ్రిటీగా మారిపోయారు. కుమారి ఆంటీ గురించి ఆమె చేసే పనుల గురించి జనాలకు ప్రస్తుతం ఒక క్యూరియాసిటీ ఉంటుంది.
వరద బాధితులకు సాయంగా కుమారీ ఆంటీ ఏం చేశారంటే
తాజాగా కుమారి ఆంటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తనలోనూ మానవత్వం ఉందని నిరూపించుకున్నారు. ఇంతకు కుమారి ఆంటీ తనలోని మానవత్వాన్ని చూపించేలా ఏం చేశారు అంటే.. కుమారి ఆంటీ వరద బాధితుల కోసం తన వంతు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ తో పాటు చాలా జిల్లాలు ముంపుకు గురయ్యాయి.

వరద బాధితుల కోసం స్పందిస్తున్న ప్రముఖులు, ప్రజలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు భారీగా నష్టం వాటిల్లింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు కాగా, వేల ఎకరాల పంట నీట మునిగింది. వారందరినీ ఆదుకోవడానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఎవరికి వారు తోచిన సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఇప్పటికీ చాలా మంది వరద బాధితుల కోసం తాము సైతం అంటూ స్పందిస్తున్నారు.
సీఎంను కలిసి వరద సహాయం అందించిన కుమారీ ఆంటీ
ఇక ఇదే క్రమంలో కుమారి ఆంటీ కూడా వరద బాధితులకు సహాయం అందించడానికి నేను సైతం అంటూ ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే కుమారి ఆంటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో నేడు కలిసి వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ 50 వేల రూపాయలను విరాళంగా అందించారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేసిన కుమారీ ఆంటీ
— Congress for Telangana (@Congress4TS) September 18, 2024
Kumari Aunty donated Rs.50 thousand to the Chief Minister's Relief Fund
• @revanth_anumula pic.twitter.com/peOLEMVpre
కుమారీ ఆంటీని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
కుమారి ఆంటీ సీఎం ను కలిసిన సమయంలో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితుల కోసం కుమారి ఆంటీ అందించిన సహాయానికి ఆమెను అభినందించారు. ఆమెను శాలువా కప్పి సన్మానించారు. వరద బాధితుల కోసం ఆమె చూపిన ఔదార్యాన్ని ప్రశంసించి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
కుమారీ ఆంటీని మెచ్చుకుంటున్న నెటిజన్లు
ఇక ఈ క్రమంలో కుమారి ఆంటీ రేవంత్ రెడ్డి ని కలిసి చేసిన వరద సాయం పైన నెటిజెన్లు స్పందిస్తున్నారు. మానవత్వంతో కుమారి ఆంటీ స్పందించిన తీరుకు ఆమెను మెచ్చుకుంటున్నారు. సాయం చెయ్యాలంటే డబ్బు కాదు కావాల్సింది మంచి మనసు అని కుమారీ ఆంటీకి కితాబిస్తున్నారు.












Click it and Unblock the Notifications