ఏడవడం కాదు: రేవంత్‌పై రమణ సంచలన వ్యాఖ్యలు, నాదెండ్లతో పోలిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి పైన తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

  MLA Revanth Reddy resignation issue ఆ సస్పెన్స్ కూడా బద్దలు కొట్టిన రేవంత్ | Oneindia Telugu

  నాడు ఎన్టీఆర్ నేడు రేవంత్, మోత్కుపల్లిపై సంచలనం: కంచర్లకు ఎల్ రమణ నోటీసులు

  నాడు నాదెండ్ల భాస్కర రావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  రేవంత్‌ది మొసలి కన్నీరు

  రేవంత్‌ది మొసలి కన్నీరు

  రేవంత్ రెడ్డి పార్టీని వీడుతూ పెట్టుకున్నది కన్నీళ్లు కాదని, మొసలి కన్నీరు అని రమణ మండిపడ్డారు. ఇచ్చిన అవకాశాలను ఆయన దుర్వినియోగం చేశారని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీకి నిలబెడతామని చెప్పారు.

  తమ్ముడిలా భావించా

  తమ్ముడిలా భావించా

  రేవంత్ రెడ్డిని తాను తమ్ముడిలా భావించి ప్రోత్సహించానని రమణ చెప్పారు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడన్నారు. అవకాశవాద రాజకీయాలకు రేవంత్ రెడ్డి పరాకాష్ఠ అన్నారు.

  టీడీపీని లేకుండా చేద్దామనుకున్నారు

  టీడీపీని లేకుండా చేద్దామనుకున్నారు

  తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దామని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, కుట్ర చేశారని ఎల్ రమణ ధ్వజమెత్తారు. టీడీపీకి అన్యాయం చేశారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా తాము ముందుకు సాగుతామని చెప్పారు.

  రేవంత్‌ను నాదెండ్లతో పోల్చిన ఎల్ రమణ

  రేవంత్‌ను నాదెండ్లతో పోల్చిన ఎల్ రమణ

  రేవంత్‌ను ఎల్ రమణ.. నాదెండ్ల భాస్కర రావుతో పోల్చారు. నాడు ఇందిరా గాంధీతో కలిసి నాదెండ్ల భాస్కర రావు టీడీపీని విచ్ఛిన్నం చేయాలని చూశారని, నేడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో కలిసి విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Telugu Desam Party chief L Ramana on Sunday make hot comments on Revanth Reddy. He compared Revanth Reddy with Nadendla Bhaskar Rao.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి