6నెలల కిందే ప్లాన్, కాంగ్రెస్ కాకుంటే మరోటి: రేవంత్‌పై రమణ సంచలనం

Subscribe to Oneindia Telugu
  కాంగ్రెస్ కాకుంటే మరోటి : రేవంత్‌కు ఝలక్‌లు

  హైదరాబాద్: టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డిపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాను పార్టీ మారాలని ఆరు నెలల ముందు నుంచే రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందించుకున్నారని అన్నారు. ఆ కథ ఇప్పుడు క్లైమాక్స్‌కు తీసుకు వచ్చారని రమణ ఆరోపించారు.

  ఏడవడం కాదు: రేవంత్‌పై రమణ సంచలన వ్యాఖ్యలు, నాదెండ్లతో పోలిక

   ఆరు నెలల కిందే ప్లాన్..

  ఆరు నెలల కిందే ప్లాన్..

  ఆరు నెలలుగా రేవంత్ కాంగ్రెస్‌కు టచ్ లో ఉన్నారని, రేవంత్‌ను ఆహ్వానించే విషయంలో మిగతా నాయకుల అభిప్రాయాలను స్వీకరించే నెపంతో కాంగ్రెస్ పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందని వ్యాఖ్యానించారు.

  గుండెకోతే: ఇదీ రేవంత్ రెడ్డి లేఖ పూర్తి పాఠం

   వాళ్లను ప్రాధేయపడ్డ రేవంత్.. కాంగ్రెస్ కాకుంటే మరోటి

  వాళ్లను ప్రాధేయపడ్డ రేవంత్.. కాంగ్రెస్ కాకుంటే మరోటి

  ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసివచ్చిన తరువాత.. ఆయన తనను వ్యతిరేకిస్తున్న డీకే అరుణ, కోమటిరెడ్డి వంటి వారి దగ్గరికెళ్లి ప్రాధేయపడ్డారని ఎల్ రమణ విమర్శించారు. తెలుగుదేశం పార్టీని వీడాలని ఆయన ఎంతో ముందుగానే అనుకున్నారని, కాంగ్రెస్ కాకుంటే మరో పార్టీలోకి మారుండేవారని అన్నారు.

   దుర్వినియోగం చేశారు..

  దుర్వినియోగం చేశారు..

  ఇంతకుముందు కూడా రమణ.. రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పార్టీని వీడుతూ పెట్టుకున్నది కన్నీళ్లు కాదని, మొసలి కన్నీరు అని రమణ మండిపడ్డారు. ఇచ్చిన అవకాశాలను ఆయన దుర్వినియోగం చేశారని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీకి నిలబెడతామని చెప్పారు. అంతేగాక, రేవంత్‌ను.. నాదెండ్ల భాస్కర రావుతో పోల్చారు. నాడు ఇందిరా గాంధీతో కలిసి నాదెండ్ల భాస్కర రావు టీడీపీని విచ్ఛిన్నం చేయాలని చూశారని, నేడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో కలిసి విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

   అవకాశవాద రాజకీయాలు..

  అవకాశవాద రాజకీయాలు..

  రేవంత్ రెడ్డిని తాను తమ్ముడిలా భావించి ప్రోత్సహించానని రమణ చెప్పారు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడన్నారు. అవకాశవాద రాజకీయాలకు రేవంత్ రెడ్డి పరాకాష్ఠ అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దామని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, కుట్ర చేశారని ఎల్ రమణ ధ్వజమెత్తారు. టీడీపీకి అన్యాయం చేశారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా తాము ముందుకు సాగుతామని చెప్పారు.

  అవసరాల కోసమే పోతుంటారు: బాబు షాకింగ్, రేవంత్ ప్రశంసలు, మళ్లీ ఏపీ నేతలపై..

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TTDP presdent L Ramana lashed out at Revanth Reddy for joining in congress issue.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి