అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన స్త్రీ ఈమెనే (ఫొటో)
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కెపల్లి గ్రామ శివారులో వెలుగు చూసిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసింది. ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శంషాబాద్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్ శుక్రవారం మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ బస్తీకి చెందిన రాపర్తి ప్రభాకర్ (46) సెక్యూరిటీ గార్డు. అతని భార్య సునీత (35)తో అదే ప్రాంతానికి చెందిన నర్సింహదాస్ గౌడ్‌తో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్ పలుమార్లు భార్యను మందలించాడు.

దాంతో తమ సంబంధానికి ప్రభాకర్ అడ్డుగా ఉన్నాడని భావించిన సునీత, నర్సింహదాస్ గౌడ్ అతని హత్యకు పథకం వేశారు. ఐ క్రమంలో నర్సింహదాస్ గౌడ్ అదే బస్తీకి చెందిన సాదిఖ్ (40)తో ప్రభాకర్ హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. లక్ష రూపాయలకు అంగీకరించి 10 వేల రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చాడు.
పథకం ప్రకారం ఈ నెల 5వ తేదీన ప్రభాకర్‌ను తీసుకుని సాదిక్ ఆరెమైసమ్మ వద్ద ఉన్న బార్‌కు వెళ్లాడు. పథకం ప్రకారం ప్రభాకర్‌కు అతిగా మద్యం తాగించాడు. దాంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత నర్సింహదాస్ గౌడ్, సాదిక్ ప్రభాకర్‌ను కారులో మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామ శివారులోని నిర్మానుష్యమైన ప్రధేశానికి తీసుకుని వెళ్లారు.
ఇద్దరూ కలిసి బండరాయితో మోదడంతో ప్రభాకర్ అక్కడికక్కడే మరణించాడు. తొలుత పోలీసులు గుర్తు తెలియని శవంగా భావించారు. ఆ తర్వాత హతుడిని ప్రభాకర్‌గా గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభాకర్ భార్య సునీత ప్రవర్తనతో అనుమానం రావడంతో పాటు స్థానికుల నుంచి సమాచారం సేకరించిన సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో నర్సింహదాస్, సాదిఖ్‌లతో పాటు సునీతను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications