ప్రియుడిని కేసులో ఇరికించేందుకు లేడీ టెక్కీ పథకం

హైదరాబాద్: తన ప్రియుడిని పోలీస్ కేసులో ఇరికించేందుకు ఓ యువతి తన మిత్రులతో కలిసి కుట్ర చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి వివరాలను హైదరాబాదులోని పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.

కడప జిల్లా పులివెందులకు చెందిన ఓ యువతి నగరంలోని ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌నగర్‌లో లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న ఆమె ప్రకాశం జిల్లాకు చెందిన ఎల్లంపల్లి సాయి అవినాష్‌ను ప్రేమించింది.

కొంతకాలం కలిసి తిరిగాక యువతి వివాహం చేసుకోవాలని కోరగా అవినాష్ ఒప్పుకోలేదు. దీంతో గత నెల ఒకటిన అతడిపై కేసుపెట్టింది. దీంతో అవినాష్ 20 రోజులు జైలులో ఉండి వచ్చాడు. అయినా పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తేవడంతో నిరాకరించాడు. దీంతో ఆ యువతి తన సోదరుడి స్నేహితుడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన చైతన్య సాయం కోరింది.

Lady techie plans to forge a false case against her lover

చైతన్య తన స్నేహితులు విక్కీ శర్మ, వి.అశోక్ రెడ్డితో నగరానికి వచ్చి, ఓ హోటల్‌లో దిగారు. అవినాష్‌ను కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారు. ఇందులో భాగంగా ముందే అనుకున్నట్లు అశోక్‌రెడ్డి ఆ యువతికి ఫోన్ చేశాడు. తాను అన్వేష్ స్నేహితుడినని, వెంటనే అతడిపై పెట్టిన కేసులు విరమించుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయిని బెదిరించాడు.

దీనిని యువతి వాయిస్ రికార్డు చేసి అవినాశ్ స్నేహితుడు బెదిరిస్తున్నాడని పోలీసులు, మీడియాకు ఇచ్చింది. యువతి వాదనపై అనుమానం కలిగిన పోలీసులు హోటల్‌లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా కుట్రను బయటపెట్టారు. త్వరలో యువతిని అదుపులోకి తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+