లగచర్లలో దాడి చేసింది రైతులు కాదు... కలెక్టర్ ప్రతీక్ జైన్ సంచలనం!
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారుల పైన దాడి చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. లగచర్లలో ఫార్మా విలేజ్ కు సంబంధించి భూసేకరణకు సంబంధించి అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ తో పాటు అధికారులపైన అక్కడ స్థానికులు దాడికి పాల్పడడంతో మొన్న ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనతో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
తనపై జరిగిన దాడిపై కలెక్టర్ ఏమన్నారంటే
దీంతో నేడు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడారు. తనను ఎవరూ కొట్టలేదని ఆయన అన్నారు. తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని, అక్కడ తాము వారితో చర్చలు జరిపామని వెల్లడించారు. ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని తెలిపిన కలెక్టర్ ఇది రైతులు చేసిన పని కాదన్నారు.

దర్యాప్తు జరుగుతోందన్న కలెక్టర్
అంతా మన రైతులు అని, మన వాళ్ళు మనపై దాడి చేయరని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని..ఎవరూ ఆందోళన చేయవద్దని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. అందరూ విధులు నిర్వర్తించాలని, ఆందోళన విరమించాలని సూచించారు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్. ఇదిలా ఉంటే వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ పలు సంచలన విషయాలను వెల్లడించారు.
లగచర్ల దాడి ఘటన ... రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు
లగిచర్ల దాడి ఘటనలో ఒక మహిళ కలెక్టర్ ను భుజం పైన కొట్టారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇఅ ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది. ముఖ్యంగా అధికారిక వర్గాల అసహనానికి కారణం అయ్యింది. కాగా ఈ వ్యవహారంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ క్లారిటీ ఇచ్చారు.
46 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు
మొత్తం లగచర్ల దాడి కఠినకు సంబంధించి ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 46 మందిని నిందితులుగా గుర్తించినట్టు వెల్లడించారు. ఏవన్ గా భోగమోని సురేష్ ను చేర్చారు. ఈనెల 11న లగచర్లలో జరిగిన ఘటనపై డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు అనేక కీలక విషయాలను సేకరించారు.
అధికారుల పైన హత్యాయత్నం
ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి చేసిన అభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు వచ్చిన సమయంలో కొందరు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని, కొందరు అధికారుల పైన హత్యాయత్నం కూడా చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, కడా అధికారి వెంకట్ రెడ్డి పైన హత్యయత్నం జరిగిందని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
అక్కడ జరిగిన రాళ్లదాడి కారణంగా కలెక్టర్, ఇతర అధికారులు, పోలీసులు గాయాలపాలయ్యారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications