ఈడీ కేసులో కేసీఆర్ ప్రస్తావనపై స్పష్టత: టీడీపీ ఎంపీ అభ్యర్థి పేరుకు బదులుగా..!!
K Kavitha: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. బెయిల్ పిటీషన్లపై నెలకొన్న ఉత్కంఠత కొనసాగుతోంది. వీటిపై విచారణను ముగించిన ఢిల్లీ హైకోర్టు.. తన తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ కేసులో బెయిల్ కోసం కవిత విశ్వ ప్రయత్నాలు చేస్తోన్నారు. గతంలో ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్లను ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం కొట్టివేసింది. దీనితో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత తరఫున ప్రముఖ న్యాయవాదులు మోహిత్ రావు, దీపక్ నగర్ అప్పీల్ పిటీషన్లను దాఖలు చేశారు.

వాటిని విచారణకు స్వీకరించింది ఢిల్లీ హైకోర్టు. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ బెంచ్.. విచారణ చేపట్టింది. పీఎంఎల్ఏలోని సెక్షన్ 19 ప్రకారం తనను అరెస్టు చేయడం అక్రమం అని, 100 కోట్ల రూపాయలను ఆప్ నేతలకు చెల్లించినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలను కూడా సంపాదించలేకపోయారని, ఆ నగదును కూడా రికవర్ చేయలేకపోయారని అన్నారు. తనను అరెస్ట్ చేయడానికి ఇదొక కారణంగా చూపించారని కవిత తరఫు న్యాయవాది చెప్పారు.
విచారణ సందర్భంగా కవిత దాఖలు చేసిన పిటిషన్లపై తమ అభిప్రాయాలను తెలియజేయాలంటూ ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది జస్టిస్ స్వర్ణ కాంత శర్మ బెంచ్. హైకోర్టు ఆదేశాల మేరకు తమ వాదనలను వినిపించారు ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు. కవితకు బెయిల్ ఇస్తే- సాక్ష్యులను ప్రభావితం చేయగలరని, సాక్ష్యాధారాలను తారుమారు చేయొచ్చని అభిప్రాయపడ్డారు.
మనీలాండరింగ్ వంటి ఆర్థిక నేరాలకు కవిత పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నందున బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. బెయిల్ పిటీషన్లను తాము వ్యతిరేకిస్తోన్నట్లు సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి తేల్చి చెప్పారు. కవిత పాత్ర ఉందంటూ వివరణాత్మక వాదనలను న్యాయస్థానానికి సమర్పించారు.

ఈడీ కేసులో విచారణ సందర్భంగా కేసీఆర్ పేరును న్యాయవాదులు ప్రస్తావించారంటూ వార్తలొచ్చాయి. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు పూర్వాపరాలన్నింటిపైనా కవిత తండ్రి కేసీఆర్‌కు సమగ్ర అవగాహన ఉందంటూ అడ్వొకేట్లు వాదించారంటూ ప్రచారం జరిగింది. ఆమె కస్టడీ కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
దీనిపై కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు క్లారిటీ ఇచ్చారు. విచారణ డాక్యుమెంట్లల్లో ఎక్కడ కూడా కేసీఆర్ పేరు లేదని తెలిపారు. ఒంగోలుకు చెందిన టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రస్తావన వచ్చిన దాన్ని కేసీఆర్‌గా భావించారని చెప్పారు. అక్కడ ప్రస్తావించింది మాగుంట పేరు తప్ప కేసీఆర్‌ది కాదని అన్నారు. మీడియాలో తప్పుడు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు.
-
తండ్రిని ఏడిపించవద్దు, కవిత పార్టీ భవిష్యత్ తేల్చేసిన కేటీఆర్..!! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications