నారాయణ 'ఆడియో టేపు': నవీన్ అరెస్ట్, నోరు విప్పితే లోగుట్టు బయటపడే ఛాన్స్!
ఆడియో టేపుల లీక్ పై పోలీసులు వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్: రామాంతపూర్ నారాయణ కాలేజీ ఉద్యోగుల ఆడియో టేపులు లీకవడం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రిన్సిపాల్ సరిత, ప్రస్తుత వైస్ ప్రిన్సిపాల్ నవీన్‌కు మధ్య జరిగిన ఆ సంభాషణలో.. వివాహేతర సంబంధాలు, నోట్ల మార్పిడి, బ్లాక్ మెయిల్స్ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
మొత్తంగా నారాయణ విద్యా సంస్థలు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి అనేలా వారి సంభాషణ కొనసాగింది. ఆడియో టేపు లీక్ అవడంపై సరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ నవీనే ఈ ఆడియో టేపు లీక్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

సరిత ఫిర్యాదు మేరకు హైదరాబాద్ ఉప్పల్ పోలీసులు నవీన్ కోసం గాలించారు.
నవీన్ సిరిసిల్లలో సంచరిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు.. శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఆడియో టేపుల లీక్ పై పోలీసులు వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నవీన్ నోరు విప్పితే నారాయణ లోగుట్టు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications