ఆ సీట్లిస్తే ఓకే.. లేదంటే దబిది దిబిడే: బీఆర్ఎస్ తో పొత్తుపై వామపక్ష పార్టీలు!!
గెలిచే సత్తా తమకు లేకున్నా ఓడించే దమ్ము మాత్రం ఉందని, తమకు గౌరవంగా ఉండే స్థానాలను ఇస్తే బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని చెప్తున్నారు లెఫ్ట్ పార్టీల నాయకులు.
తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కనబడుతోంది. ఇప్పటికే పాదయాత్రలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని అనేక పార్టీల నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తమన ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటే, మరొక వైపు పొత్తుల రాజకీయాలు తెర మీదకు వస్తున్నాయి. తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆ కసరత్తులో బిజీగా ఉంది. ఇక ఇదే సమయంలో ఎవరికి వారు ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.

బీఆర్ఎస్ తో పొత్తుపై లెఫ్ట్ పార్టీల భేటీ
తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండాలంటే తమకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించాలని సిపిఐ, సిపిఎం పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. తమకు గౌరవప్రదమైన సీట్లను కేటాయిస్తేనే పొత్తు ఉంటుందని, లేదంటే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించుకోవలసి వస్తుందని చెబుతున్నాయి. అంతేకాదు ఇదే విషయంలోబీఆర్ఎస్ పార్టీతో చర్చించాల్సి వస్తే అడగాలని అంశంపై నేడు సిపిఐ, సిపిఎంలు భేటీ నిర్వహించి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.

ఆ స్థానాలపై ఎర్ర పార్టీలు గట్టిగా పట్టుబట్టే అవకాశం
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ తమ పార్టీలకు బలమున్న స్థానాలపైన చర్చించి ఆయా స్థానాలలో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరే ఆలోచనలో ఉన్నారు ఎర్ర పార్టీల నాయకులు. సిపిఎం, సిపిఐ రెండు పార్టీలు చెరో పది సీట్లు అడగాలని, కనీసం చెరో ఐదు సీట్లు అయినా ఇచ్చేలా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే చివరకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలను కోరడంతో పాటు, రెండు ఎమ్మెల్సీ సీట్ల చొప్పున అయినా అడగాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సిపిఐ కొత్తగూడెం స్థానాన్ని, సిపిఎం భద్రాచలం స్థానాన్ని తప్పనిసరిగా అడిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

పొత్తుపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలతో లెఫ్ట్ పార్టీల స్పందన ఇదే
ఇక ఇప్పటికే లెఫ్ట్ పార్టీలతో పొత్తులు, సీట్ల కేటాయింపుకు సంబంధించి కొందరు బీఆర్ఎస్ నేతలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారికి అసెంబ్లీ ఎన్నికలలో ఎటువంటి సీట్లు కేటాయించేది లేదని, చెరో ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామన్నట్టుగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల సిపిఐ, సిపిఎం నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒకవేళ అటువంటి ఆలోచన చేస్తే మాత్రం మళ్ళీ ఆలోచించుకోవాలని, లేదంటే తాము ప్రత్యామ్నాయ ఆలోచన చేయాల్సి ఉంటుందంటూ లెఫ్ట్ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.

గెలిచే సత్తా లేకున్నా ఓడించే దమ్ము ఉందంటున్న లెఫ్ట్ పార్టీలు
గెలిచే సత్తా తమకు లేకున్నా ఓడించే దమ్ము మాత్రం ఉందని, తమను తక్కువగా అంచనా వేస్తే బిఆర్ఎస్ పార్టీకే నష్టం జరుగుతుందని, అధికార పార్టీకి దబిడి దిబిడే అంటున్నారు. బిజెపికి చెక్ పెట్టాలంటే కనుక గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో సిపిఐ ,సిపిఎం కూడా ఒకరికి ఒకరు పోటీగా అభ్యర్థులను నిలపొద్దని, పరస్పర ఐక్యతతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే నేడు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు, ఇతర అంశాలపై సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం సహా పార్టీకి చెందిన ఇతర సీనియర్ నాయకులు భేటీకానున్నారు. ఈ భేటీలో అనేక కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications