కేఏ పాల్ ఎన్నికల ప్రచారం.. ప్రధాన పార్టీలకు దీటుగా.. హామీలు చూస్తే షాక్ పక్కా!!

మునుగోడు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మునుగోడు ఉపఎన్నిక ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించాలని, తమ పార్టీ జెండా ఎగురవేయాలని తాపత్రయపడుతున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో నేను సైతం అంటూ కే ఏ పాల్ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు.

మునుగోడులో హల్చల్ చేస్తున్న కేఏ పాల్

మునుగోడులో హల్చల్ చేస్తున్న కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ మునుగోడులో నేను సైతం అంటూ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంటే, ఆ రాజకీయ పార్టీల వల్ల మునుగోడు అభివృద్ధి సాధ్యం కాదు. నాకు ఓటేసి గెలిపించండి. నేను మునుగోడు ని అభివృద్ధి చేస్తాను అంటూ కె ఏ పాల్ ప్రజలను కోరుతున్నారు.

 ఎన్నికల ప్రచారంలో దోసెలు వేసిన కేఏ పాల్

ఎన్నికల ప్రచారంలో దోసెలు వేసిన కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణకు గురి కాగా, ఇండిపెండెంట్ గా వేసిన నామినేషన్ తో ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. తన పార్టీకి ఎన్నికల సంఘం అధికారులు ఉంగరం గుర్తును కేటాయించారని, తనకు ఓటు వేసి గెలిపిస్తే మునుగోడును అమెరికా చేస్తానంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కే ఏ పాల్. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడులోని ఓ చిన్నహోటల్ లో దోశలు వేసి అక్కడ ఉన్న ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేశారు. అంతేకాదు సదరు హోటల్ నిర్వహిస్తున్న దంపతుల ఇద్దరు పిల్లలను కేజీ నుంచి పీజీ వరకు తానే చదివిస్తానని కె ఏ పాల్ వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు.

మునుగోడు యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదే: కే ఏ పాల్

మునుగోడు యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదే: కే ఏ పాల్

మునుగోడు నియోజకవర్గంలో గెలిపిస్తే అక్కడ ఉన్న వందల మంది పిల్లలను తాను చదివిస్తానని, మండలానికి ఒకటి చొప్పున ఆసుపత్రిని, కాలేజీని కట్టిస్తానని కే ఏ పాల్ తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఇక రైతుల సమస్యలను సైతం పరిష్కరిస్తానని చెప్పిన కే ఏ పాల్ మునుగోడు లో ఉన్న ఏడు మండలాల్లో ఏడు వేల మందికి ఆరు నెలల్లోనే ఉద్యోగాలు ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. రెండు సంవత్సరాలలో మునుగోడులో నిరుద్యోగ సమస్య లేకుండా చేసి అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానని కె ఏ పాల్ హామీ ఇచ్చారు. నిరుద్యోగులు అందరూ తన కేఏపాల్ యాప్ లో లాగిన్ అవ్వమని చెప్పిన ఆయన, అలాగే ఆ యాప్ ని షేర్ చేయమని కోరారు.

 ఆ పార్టీల కార్యకర్తలు అందరూ తనకే ఓట్లు వేయాలన్న కే ఏ పాల్

ఆ పార్టీల కార్యకర్తలు అందరూ తనకే ఓట్లు వేయాలన్న కే ఏ పాల్

అంతేకాదు ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తున్న తనకు బిజెపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఓట్లు వేయాలని కె.ఏ.పాల్ విజ్ఞప్తి చేశారు. తన పార్టీ గుర్తు ఉంగరం పేర్కొన్న ఆయన కుల, కుటుంబ, అవినీతి పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టి మన మునుగోడు అభివృద్ధి చేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చెబుతున్న రాజకీయ నాయకుల ప్రచారాన్ని, దొంగ మాటలను ఎవరూ నమ్మవద్దని కే.ఏ పాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి మునుగోడు ఎన్నికల ప్రచారంలోకి కే ఏ పాల్ దిగడంతో మునుగోడు నియోజకవర్గంలో ప్రజలలో పాల్ ప్రచారం ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+