మందు బాబులకు గుడ్‌న్యూస్: 31న అర్ధరాత్రి వరకు లిక్కర్ అమ్మకాలు
హైదరాబాద్: తెలంగాణ సర్కారు మందుబాబులకు తీపికబురు చెప్పింది.
కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మద్యం విక్రయ సమయాన్ని పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది.
బార్ అండ్ రెస్టారెంట్లలో రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయించేందుకు అవకాశం కల్పించారు. ఇది ఇలావుంటే, న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు కూడా పలు ఆంక్షలను విధించారు. త్రీ స్టార్, ఆపై హోటళ్లకు, పబ్బులకు ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని నిర్వాహకులను సూచించారు. పార్కింగ్ ప్రదేశాల్లోనూ కెమెరాలు తప్పనిసరి చేశారు.

అసభ్యకర నృత్యాలు లేకుండా చూడాలని పోలీసులు స్పష్టం చేశారు. వేడుకల్లో శబ్ధ తీవ్రత 45 డెసిబెల్స్ కి మించకూడదని షరతు విధించారు. పరిమితికి మించి టికెట్లు, పాసులు జారీ చేయవద్దని ఆదేశించారు. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని తేల్చి చెప్పారు.
మరోవైపు, నగరంలోని పలుమార్గాల్లోనూ పోలీసులు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. కొన్ని ఫ్లైఓవర్లపైకి అనుమతులను నిరాకరించే అవకాశం ఉంది. అంతేగాక, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించే అవకాశం ఉంది. నూతన సంవత్సర వేడుకలను మంచి వాతావరణంలో జరుపుకోవాలని, అందరూ సురక్షితంగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications