రేవంత్ రెడ్డికి రూ. లక్షా 50 వేల కోట్ల కల వచ్చింది: కిషన్ రెడ్డి సెటైర్లు

హైదరాబాద్: మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విసిరిస సవాల్‌ను స్వీకరిస్తున్నామన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మూసీ సుందరీకరణ-పునరుజ్జీవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతున్న తీరును వ్యతిరేకిస్తూ.. మూసీ బాధితులకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించేందుకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టిన మహాధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని.. పేదల ఇళ్ల కూల్చివేతలకు మాత్రమే వ్యతిరేకమన్నారు. పేదల ఇళ్లు కూల్చే దుర్మార్గపు ఆలోచనను సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నామని.. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని పేద ప్రజల ఇళ్లల్లో ఉండేందుకు తాము సిద్ధమేనని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు.

Looting in the name of musi purge Kishan Reddy criticizes CM Revanth Reddy

ప్రజల కనీస సౌకర్యాలు ముఖ్యమా?.. రూ. లక్షల కోట్లు అప్పు చేసి మూసీ సుందరీకరణ ముఖ్యమూ సీఎం రేవంత్ తేల్చుకోవాలన్నారు. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని కిషన్ రెడ్డి సూచించారు. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు ఉన్నాయని తెలిపారు. ఏది ముఖ్యమని ప్రశ్నించారు. వాటిని కూల్చే దమ్ముందా? అని సవాల్ విసిరారు.

మూసీ సుందరీకరణ ముఖ్యమా? కాలనీల్లో రోడ్లు వేయడం ముఖ్యమా? అని నిలదీశారు. గ్రేటర్ మున్సిపాలిటికీ, వాటర్ బోర్డ్‌కి వీధి లైట్లకు డబ్బులు లేవుగానీ.. లక్షా యాభై వేల కోట్ల అప్పు తెచ్చి మూసీ సుందరీకరణ అవసరమా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ పక్కన ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్ల పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. పేదల ఇళ్లపైనే ప్రతాపం ఎందుకు అని ప్రశ్నించారు.

పేదల ఇళ్లు కూలుస్తామంటే ఒప్పుకోమన్నారు. రేవంత్ రెడ్డికి కలక పడ్డది.. లక్షా 50 వేల కోట్ల మీద కల పడ్డదేమో అని సెటైర్లు వేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. పేద ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. మసిపూసి మారేడు కాయ చేసి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందన్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+