మాదాపూర్ డ్రగ్స్ కేసు: హీరో నవదీప్ ఇంట్లో సోదాలు; పిటీషన్ పై హైకోర్టులో విచారణ!!
మాదాపూర్ డ్రగ్స్ కేసు ఇప్పుడు టాలీవుడ్లో సంచలనంగా మారింది. ఈ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను ఏ 29 గా పోలీసులు పేర్కొన్నారు. ఆయనను డ్రగ్స్ వినియోగదారుడు గా పేర్కొన్న పోలీసులు నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పిన విషయం తెలిసిందే.
అయితే తనకు ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని, పోలీసులు నవదీప్ అని చెప్పారు కానీ హీరో నవదీప్ అని చెప్పలేదని పేర్కొన్న నవదీప్, ఇప్పుడు మాదాపూర్ డ్రగ్స్ కేసులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఈనెల 16వ తేదీన హైదరాబాద్లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

నార్కోటిక్స్ పోలీసులు నవదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో ఆయన ఇంట్లో లేడని సమాచారం. అయితే ఈ వ్యవహారంలో తాజాగా కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని టీఎస్ హైకోర్టును నవదీప్ ఆశ్రయించారు. హీరో నవదీప్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఈరోజు వరకు ఆయన అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది.
అయితే ఈ కేసులో ఈరోజు హైకోర్టులో నవదీప్ కు సంబంధించి నార్కోటిక్ బ్యూరో కౌంటర్ దాఖలు చేయనుంది. అయితే రేపు హీరో నవదీప్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ పై యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్న నేపథ్యంలో వారు నవదీప్ కి సంబంధించి ఎటువంటి అంశాలు పేర్కొంటారు అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది.
మాదాపూర్ లో ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పోలీసులు అరెస్ట్ చేసిన రామచంద్ర అనే వ్యక్తి, నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ సేవించినట్టుగా తెలపడంతో ఈ కేసులో నవదీప్ ని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications