కాంగ్రెస్ మార్క్ రాజకీయం: రేవంత్‌పై మధుర శ్రీధర్ సెటైర్లు
హైదరాబాద్: ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు.
కాంగ్రెస్ మార్క్ రాజకీయం
‘కాంగ్రెస్ పార్టీలో తొందరగానే ప్రమోషన్ సాధించేందుకు మోడీని విమర్శించడాన్ని రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను రేవంత్ స్టార్ట్ చేశారు. బహుశా ఇదే ట్రెండ్ 2019, నాటికి దేశమంతా వ్యాపిస్తుంది' అని మధుర శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవల ప్రకాశ్ రాజ్.. మోడీపై చేసిన వ్యాఖ్యలకు కూడా శ్రీధర్ రెడ్డి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. మొదట నీవు నిజాయితీ ఉండూ అంటూ ప్రకాశ్ రాజ్‌కు హితవు పలికారు.

మోడీపై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కులం, మతం, అబద్దాల ప్రాతిపదికనే మోడీ, బీజేపీ గెలిచారన్నారు. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను కులానికి ఆపాదించారని విమర్శించారు. గుజరాత్‌లో అభివృద్ధి నినాదమే వినిపించలేదని, నైతికంగా బీజేపీ పతనమయిందన్నారు. ఇంత దిగజారుడు ప్రధానిని తాను చూడలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇటీవల ప్రకాశ్‌రాజ్‌కు మధుర కౌంటర్
ఇటీవల ప్రకాశ్ రాజ్.. మోడీపై చేసిన వ్యాఖ్యలకు కూడా శ్రీధర్ రెడ్డి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ‘నీ గోల ఎంటో అస్సలు అర్థం కావడం లేదు. నీ అహంకారంతో ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లను ఇబ్బంది పెడుతుంటావు కదా. నువ్వు సంతోషంగా ఉన్నావా? కేవలం హెడ్‌లైన్స్‌లో ఉండాలని ప్రయ్నత్నించకు. సమస్యలపై పోరాటం చేయ్. ప్రభావవంతమైన నాయకుడిగా ఎదుగు. అప్పుడు ఎదుటివారిపై కామెంట్ చెయ్. అప్పుడు మేం నిన్ను సీరియస్‌గా తీసుకుంటాం' అని శ్రీధర్ ట్వీట్ చేశారు.

ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే..
బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 150+ సీట్లలో గెలుపొందుతుందనీ ఢంకాబజాయించారు. మరి ఇపుడు 150 సీట్లు ఎక్కడ అంటూ ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలను ప్రశ్నించారు. గుజరాత్ అసెంబ్లీ ఫలితాలపై ప్రకాష్ రాజ్ 'జస్ట్ ఆస్కింగ్' అంటూ సోమవారం ఓ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్‌పై టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications