వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలెక్టర్ ప్రీతి-ఎమ్మెల్యే శంకర్ ఇష్యూ: కేసీఆర్‌ను లాగిన రేవంత్ రెడ్డి

మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాపై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ పైన నిర్భయ కేసు పెట్టి జైలుకు పంపించాలని తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్ష నేత రేవంత్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాపై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ పైన నిర్భయ కేసు పెట్టి జైలుకు పంపించాలని తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్ష నేత రేవంత్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు స్పందించకుంటే మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

కలెక్టర్‌తో అసభ్య ప్రవర్తన: ఎమ్మెల్యే శంకర్‌పై కేసు నమోదు, స్టేషన్ బెయిల్ కలెక్టర్‌తో అసభ్య ప్రవర్తన: ఎమ్మెల్యే శంకర్‌పై కేసు నమోదు, స్టేషన్ బెయిల్

ఓ మహిళా అధికారిని ఓ పార్టీ ఎమ్మెల్యే అవమానించినందుకు గాను, ఆ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కలెక్టర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ స్పందన దారుణంగా ఉందన్నారు.

 Mahbubabad B Shankar Nayak MLA in molestation row: Revanth Reddy drags KCR

ఘటన విషయం తెలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌లను పురమాయించడం విడ్డూరమన్నారు. శంకర్ నాయక్ పైన సాధారణ సెక్షన్ల కింద కేసు పెట్టి కేసును నీరుగార్చుతున్నారన్నారు.

కలెక్టర్ మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్య ప్రవర్తన.. కేసీఆర్ హెచ్చరిక!కలెక్టర్ మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్య ప్రవర్తన.. కేసీఆర్ హెచ్చరిక!

స్టేషన్ బెయిల్ ఇచ్చి నిందితులను ప్రోత్సహిస్తున్నారన్నారు. శంకర్ నాయక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుంటే కేసీఆర్ ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు.

English summary
A ruling Telangana Rashtra Samiti MLA, B Shankar Nayak, was embroiled in a controversy on Wednesday after he was charged with molestation by a woman collector during the launch of the third phase of Haritha Haram programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X