హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహేశ్ బాబు శ్రీమంతుడు స్ఫూర్తి: అసలైన హీరో అంటూ ప్రిన్స్ ప్రశంస, కేటీఆర్ ఆహ్వానం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ సినిమా చూసిన చాలా మంది తమ సొంత ఊరికి ఏదో ఒక సాయం చేయాలని నిర్ణయించుకుంటున్నారు. అంతేగాక, చాలా మంది ఆ నిర్ణయాలను అమల్లోకి కూడా తీసుకొస్తున్నారు. తాజాగా, కామారెడ్డి జిల్లాలో కూడా ఒకటి చోటు చేసుకుంది.

కేటీఆర్ ట్విట్టర్ ఫొటోలపై మహేశ్ స్పందన

ఓ పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ 'శ్రీమంతుడు' సినిమా స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసుకున్నారు. దాత సహకారంతో కార్పొరేట్ తరహాలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాగా, మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేసిన బీబీపేట పాఠశాల ఫొటోలపై మహేష్ బాబు స్పందించారు.

అసలైన హీరో మీరేనంటూ సుభాష్ రెడ్డిపై మహేశ్ బాబు ప్రశంసలు

కామారెడ్డి జిల్లా బీబీపేట పాఠశాల అభివృద్ధి గురించి మహేశ్ బాబు తెలుసుకున్నారు. 'శ్రీమంతుడు' సినిమా బృందంతో కలిసి పాఠశాలను సందర్శిస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు మహేశ్ బాబు. కాగా, బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి బీబీపేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఆ పాఠశాల భవనాన్ని సుభాష్ రెడ్డి రూ. 6 కోట్లతో ఆధునిక హంగులతో కార్పొరేట్ పాఠశాల తరహాలు పునర్నిర్మించారు. సుభాష్ రెడ్డి అసలైన హీరోనని, ఆయనలాంటి వాళ్లు సమాజానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా మహేశ్ బాబు ప్రశంసించారు.

Recommended Video

MLC Elections : బిగ్ ఫైట్.. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికల కోలాహలం..! || Oneindia Telugu

మహేశ్ బాబును తీసుకొస్తానంటూ మంత్రి కేటీఆర్


కాగా, బీబీపేట మండల కేంద్రంలో సుభాష్ రెడ్డి సొంత ఖర్చుతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. బీబీపేటలో పాఠశాల నిర్మించిన సుభాష్ రెడ్డి స్ఫూర్తితో ఇక్కడి తన పూర్వీకుల గ్రామం కోనాపూర్(పోసానిపల్లి)లోని ప్రాథమికోన్నత పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని తెలిపారు. బీబీపేట ఉన్నత పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్‌డేట్ చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఈ కాలేజీ ప్రారంభోత్సవానికి మహేశ్ బాబును తీసుకొస్తానని చెప్పారు. ఆయన నటించిన సినిమా శ్రీమంతుడు స్ఫూర్తితో మరికొందరు దాతలు బడులను దత్తత తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేస్తున్నామన్నారు. పాఠశాల నిర్మించడమే కాకుండా నిర్వహణ కోసం పూర్వ విద్యార్థులతో కలిసి రూ. 1.20 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

English summary
mahesh babu praises Subhash Reddy, who built school, with his own money: KTR invites Srimanthudu Actor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X