జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడు, సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు!

హైదరాబాద్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఖమ్మంలో బహిరంగ సభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ తోపాటు తెలంగాణ అభివృద్ధి చేసింది టీడీపీనేనని అన్నారు. అంతేగాక, తెలంగాణలో కూడా టీడీపీ బలపడాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని వీడిన నాయకులు తిరిగి టీడీపీలో చేరాలని పిలుపునిచ్చారు. టీటీడీపీకి తాను అండగా ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, మాజీ టీడీపీ నేతలు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఏపీ, తెలంగాణలో చంద్రబాబు ఫెయిల్ అంటూ ఎర్రబెల్లి

ఏపీ, తెలంగాణలో చంద్రబాబు ఫెయిల్ అంటూ ఎర్రబెల్లి

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఆంధ్రాలో, తెలంగాణలో చంద్రబాబు ఫెయిలయ్యారని విమర్శించారు. టీడీపీ చంద్రబాబు పార్టీ కాదన్నారు. టీడీపీ ఎన్టీఆర్ పార్టీ అని చెప్పారు. అంతేగాక, చంద్రబాబు టీడీపిలోకి మధ్యలోనే వచ్చాడని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు మోసం చేశాడన్నారు. ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే.. ఆయన కుటుంబానికి చంద్రబాబు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.

జూ. ఎన్టీఆర్ టీడీపీ చీఫ్, సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

జూ. ఎన్టీఆర్ టీడీపీ చీఫ్, సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

అంతేగాక, కుట్రపూరితంగా తన కొడుకు లోకేష్‌ను ఫోకస్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌ను ఎవరూ కోరుకోవడం లేదన్నారు ఎర్రబెల్లి దయాకర్రావు. జూనియర్ ఎన్టీఆర్‌నే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని.. టీడీపీ అధ్యక్షుడిగా ఆయన ఉంటేనే బాగుంటుందని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఏపీలో ముఖ్యమంత్రిగా జూనియర్ ఎన్టీఆర్ ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. టీడీపీ, ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్‌ను సీఎం చేయాలని.. ఇలా చేస్తే చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబంపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యానించారు.

కేఏ పాల్, షర్మిలలా చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్న ఎర్రబెల్లి

కేఏ పాల్, షర్మిలలా చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్న ఎర్రబెల్లి

ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ బిడ్డను తెలంగాణలో ఎన్నికల్లో పెట్టి ఓడించారని ఎర్రబెల్లి మండిపడ్డారు. ఎక్కడా పొద్దుపొకే తెలంగాణకు వస్తున్నాడని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఇక్కడ చిచ్చుపెట్టేందుకు గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశాడన్నారు. ఇప్పుడు బీజేపీతో ములాఖత్ అయి చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు. తెలంగాణలో కేఏ పాల్, వైఎస్ షర్మిల మాదిరిగా చిచ్చుపెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడని ఎర్రబెల్లి దుయ్యబట్టారు. మరోవైపు కేంద్రంపైనా ఎర్రబెల్లి విమర్శలు గుప్పించారు. ఉపాధి హామీ నిధులు మళ్లిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ సంపదపై షర్మిల, పవన్, చంద్రబాబు కన్నేశారు!

తెలంగాణ సంపదపై షర్మిల, పవన్, చంద్రబాబు కన్నేశారు!

మరోమంత్రి గంగుల కమలాకర్ కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సంపదపై కన్నేసి కొందరు వస్తున్నారని.. ప్రజలు మేల్కోవాలని అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అత్తగారిల్లంటూ ఇక్కడికి వచ్చారని మండిపడ్డారు. కేఏ పాల్, పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు అసలు మనిషి చంద్రబాబు కూడా ప్రవేశించారన్నారు. తెలంగాణ సంపదపై కన్నేసి వీరంతా ఇక్కడికి వచ్చారని గంగుల ఆరోపించారు. వీళ్లందరి వెనకాలే బీజేపీనే ఉందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వాళ్లు కూడా వీళ్లను నమ్మరని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+