హైదరాబాద్ లో సకల సౌకర్యాల రైల్వే స్టేషన్..!!

మలక్‌పేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చేపట్టిన ఈ పనులు 2026 జూన్ నాటికి పూర్తవుతాయని అంచనా. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్ పాతబస్తీ సహా పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. దీనికి సంబంధించిన వివరాలు, ఫొటోలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేశారు.

'నయా భారత్ నయా స్టేషన్'లో భాగంగా రూ. 26.44 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టింది. ఆధునిక సౌకర్యాలు, మెట్రో అనుసంధానం, పర్యావరణ హితమైన డిజైన్‌తో ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మలక్‌పేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా అనేక నూతన సదుపాయాలు కల్పించనున్నారు. మెరుగైన లైటింగ్, విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, అప్‌గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలం ఇందులో ఉన్నాయి.

Malakpet Railway Station Redevelopment Set for 2026 Completion

దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ వినియోగంతో పర్యావరణ హితమైన భవనం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆధునిక వాస్తుశిల్పంతో, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో ఇది నగర కేంద్రంగా మారనుంది. కాచిగూడ- ఫలక్‌నుమా సబర్బన్ మార్గంలో.. పాతబస్తీలో వ్యూహాత్మక స్థానంలో ఉన్న ఈ స్టేషన్ మలక్‌పేట, దిల్ సుఖ్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల ప్రయాణికులకు సేవలందిస్తుంది.

కాచిగూడ-కర్నూలు తుంగభద్ర ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ వంటి ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడ హాల్ట్ సౌకర్యం ఉంది. అభివృద్ధి పూర్తయ్యాక మరిన్ని రైళ్లు ఇక్కడ ఆగనున్నాయని, ఇది మరింత మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ పునరాభివృద్ధిలో కొత్త ముఖద్వారం, రెండో ప్రవేశ మార్గంలో స్టేషన్ భవనం అభివృద్ధి, సర్క్యులేటింగ్ ఏరియా విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

భవిష్యత్ అవసరాల కోసం 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రూఫ్ ప్లాజా, మెట్రో కనెక్టివిటీతో అనుసంధానం వంటివి ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల కోసం లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫారాల మెరుగుదల, కాన్కోర్స్, వెయిటింగ్ హాల్స్, వీఐపీ లాంజ్ ఇంటీరియర్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, కొత్త సైనేజ్, కొత్త ఫర్నిచర్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ట్రైన్ ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+