ప్రగతి భవన్ ఎదుట కలకలం.. పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
హైదరాబాద్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మలక్‌పేట్‌కు చెందిన మహమ్మద్ నసీరుద్దీన్‌గా గుర్తించారు. స్థానికంగా చెప్పుల దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా రెండు నెలల నుంచి షాపు మూతపడటంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు పెట్రోల్‌తో వచ్చి ఆత్మహత్యకు యత్నించాడు.

Recommended Video
కోడెల ఆత్మహత్య పై బసవతారకం ఆసుపత్రి నుండి స్పెషల్ రిపోర్ట్
ఒంటిపై అతను పెట్రోల్ పోసుకుంటుండగా.. అక్కడే ఉన్న పోలీసులు అప్రత్తమై అడ్డుకున్నారు. అనంతరం అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications