భార్యకు టీబీతో అనే బాధతో భార్త ఆత్మహత్య

హైదరాబాద్: రెండు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి భార్యకు టిబి ఉందని తెలిసి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - పార్సిగుట్ట న్యూ అశోక్ నగర్ కు చెందిన ఆటోడ్రైవర్ జి.సురేష్ (24) రెండు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన జ్యోతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో జ్యోతి తనకున్న టిబి వ్యాధి గురించి దాచిపెట్టింది. రెండు నెలలు బాగానే కాపురం చేసిన ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

man commits suicide in Hyderabad

అక్కడ ఆమెకు అప్పటికే టిబి ఉన్న విషయం బయటపడటంతో ఆమెను ఎర్రగడ్డలోని టిబీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లిన సురేష్ అక్కడ చేర్పించి గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. మానసికంగా కుంగిన అతను జీవితంపై విరక్తితో ఇంట్లో దులానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికులు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+