అదృష్టం బాగోకుంటే పూరీ తిన్నా ప్రాణం పోద్ది.. ఇది నిజం
అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది ఇది వేదం సినిమా డైలాగ్.. ఇదే పంధాలో అదృష్టం బాగోకుంటే పూరీ తిన్నా ప్రాణం పోతుంది. ఇది నిజం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో సరిగ్గా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే
పూరీ తింటుండగా పోయిన ప్రాణం
మహబూబ్ నగర్ జిల్లా రాజ్ పూర్ మండలం ఖానాపూర్లో పూరి తింటుండగా గొంతులో ఇరుక్కుని ఒక యువకుడు ఊపిరాడక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. పూరి తింటుంటే ప్రాణం పోవడం ఏమిటి అని చర్చించుకుంటున్నారు.

పూరీలు తెచ్చి తినమన్న యజమాని
తొలి ఏకాదశి పండుగ రోజున ఖానాపూర్లో జరిగిన ఈ ఘటనలో బేగరి కుమార్ అనే 25 సంవత్సరాల యువకుడు పూరి తింటుండగా గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. తిల్లాపూర్ గ్రామానికి చెందిన రామిరెడ్డి అనే రైతు దగ్గర బ్యాగరి కుమార్ కొంతకాలంగా పనిచేస్తున్నాడు. అయితే నిన్న తొలి ఏకాదశి పండుగ సందర్భంగా పొలానికి వెళ్లిన రామిరెడ్డి పొలంలో పనిచేస్తున్న పనివాళ్ళందరికీ పూరీలు తీసుకువచ్చి తినమని ఇచ్చాడు.
పూరీ గొంతులో ఇరుక్కుపోయి మృతి
అందరూ పూరీలు తింటున్న సమయంలో కుమార్ గొంతులో పూరి ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే నీళ్లు తాగించడానికి ప్రయత్నం చేశారు. అప్పటికే కుమార్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఊహించని విధంగా పూరి తింటూ కొడుకు చనిపోవడంతో ఆ తల్లి బోరు బోరున రోదిస్తోంది. తన ఇంటికి ఆధారమైన కొడుకు ఈ విధంగా చనిపోతాడని ఊహించలేదని కన్నీరు మున్నీరు అవుతుంది.
తినేటప్పుడు జాగ్రత్త
కుమార్ మృతి తో ఖానాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఖానాపూర్లో మాత్రమే కాదు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కుమార్ మృతి పట్ల షాక్ కు గురవుతున్నారు. పూరీ ప్రాణాలు తీయటం ఏమిటని అందరూ నోరెళ్ళబెడుతున్నారు. పూరి తింటూ ప్రాణాలు కోల్పోవడం దారుణమని చర్చించుకుంటున్నారు. అంతే కాదు తినేటప్పుడు కూడా జాగ్రత్తగా తినాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications