మృతి చెందిన 4 రోజుల తర్వాత స్వైన్ ఫ్లూ నిర్ధారణ
హైదరాబాద్: వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివనగర్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. అతని మరణానికి కారణం స్వైన్ ఫ్లూనే అంటూ వైద్యులు నిర్ధారించారని, స్ధానికంగా ఉన్న వైద్యులు మంగళవారం తెలిపారు.
అతని మరణానికి స్వైన్ ఫ్లూ కారణమనే అనుమానంతో ఎంజీఎం వైద్యులు అతడి నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వారికి పరీక్ష నిమిత్తం పంపించారు. అతడి నమూనాలను పరిశీలించిన వైద్యులు స్వైన్ ఫ్లూ కారణంగానే ఆ వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు.

దీంతో శివనగర్‌కు చెందిన వ్యక్తి మృతి చెందిన నాలుగు రోజుల తర్వాత స్వైన్ ఫ్లూ ద్వారానే చనిపోయినట్లు ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కాగా, ఎంజీఎంలో చికిత్స పొందుతున్న రఘునాథపల్లి మండలానికి చెందిన మరో వ్యక్తికి కూడా స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
వరంగల్ జిల్లాలో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications