భార్య డబ్బులివ్వలేదని పిల్లలిద్దరనీ చంపేసి, తాను ఉరేసుకున్నాడు
మహబూబ్‌నగర్: దుస్తులు తెచ్చుకునేందుకు మామ, తన భార్య డబ్బులివ్వలేదని ఒక వ్యక్తి కన్నబిడ్డలకు ఉరేసి తానూ ఉరేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా పల్లెపాడులో ఈ సంఘటన చోటు చేసుకుంది. కర్నూలు పట్టణం షరీ్‌ఫనగర్ కాలనీవాసి ఇసాక్ అలియాస్ రాములుకు, రమాదేవితో ఏడేళ్ల కిందట పెళ్లయింది.
వీరికి ఇద్దరు పిల్లలు సిద్దార్థ(5), ధీరజ్ (9నెలల) ఉన్నారు. మూడు వారాల కిందట వీరు అత్తమామల ఇంటికి వచ్చి, కూలీనాలీ చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. సోమవారం భార్య, అత్తమామలతో గొడవపడిన ఇసాక్ ఇద్దరు పిల్లలతో ఎటో వెళ్లిపోయాడు. రాత్రయినా రాకపోవడంతో బంధువులు కర్నూలుకు వెళ్లి ఆరాతీశారు.

అయితే, మంగళవారం వీరి ముగ్గురి శవాలు చెట్టుకు వేలాడుతున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో గ్రామస్థుల సాయంతో పొలాల్లో వెతకగా ఓ తుమ్మచెట్టుకు ఇద్దరు పిల్లల శవాలతో పాటు ఇసాక్ మృతదేహం వేలాడుతూ కనిపించాయి.
కాగా, భార్య రమాదేవి వివాహేతర సంబంధం కలిగి ఉండడమే తమ తమ్ముడి మృతికి కారణమని ఇసాక్ అన్న అనంతరత్నం పోలీసులకు చెప్పాడు. అయితే అల్లుడు డబ్బులు అడిగాడని, ఇవ్వనందుకే ఇలా చేసుకున్నాడని రమాదేవి తరఫు బంధువులు తెలిపారు.
అతను బోరవెల్లి సమీపంలో పొలంలోకి వెళ్లాడు. అక్కడ మద్యం తాగి పిల్లల తలలపై రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. అప్పటికీ పిల్లలు మృతిచెందకపోవడంతో పొలంలో ఉన్న టార్పాలిన్ అంచు, చిరిగిన దుస్తులను తీసుకొని పిల్లల గొంతు నులిమి హతమార్చాడు.
అనంతరం ఇసాక్ కూడా అదే దుస్తులను గొంతుకు చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం అలంపూర్ ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ బాలకోటి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.












Click it and Unblock the Notifications