కారెక్కిన మండవ : కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్
హైదరాబాద్ : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. నిజామాబాద్ కు చెందిన కీలకనేత కారెక్కడంతో .. అక్కడ టీఆర్ఎస్ మరింత బలోపేతం కానుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు మేలు చేకూర్చనుంది.

కారెక్కిన మండవ
ఇందూరులో టీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలపై ఎర్రజొన్న రైతుల నిరసన ప్రభావితం చేస్తోంది. దీనికితోడు రైతులు బరిలో ఉండటంతో .. పార్టీ బలోపేతంపై గులాబీ దళపతి ఫోకస్ ఇందులో భాగంగా నిన్న మండవ ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కేసీఆర్, మండవ .. టీడీపీలో ఉన్నప్పుడు సన్నిహితులు. ఆ చనువుతోనే సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.
మండవతోపాటు గాయత్రిరవి
అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరగా ... తాజాగా మండవతోపాటు వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసినా గాయత్రి రవి కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications