హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఠాగూర్ ఔట్.. థాక్రే ఇన్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీగా మాణిక్ రావు థాక్రే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర ఇంఛార్జీని మార్చేసింది అధిష్టానం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీగా ఉన్న మాణిక్కం ఠాగూర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీగా మాణిక్ రావు థాక్రే

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీగా మాణిక్ రావు థాక్రే

ఈ నేపథ్యంలో ఠాగూర్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత మాణిక్ రావు థాక్రేను తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీగా అధిష్టానం నియమించింది. మాణిక్కం ఠాగూర్‌ను గోవా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ బాధ్యతలను అప్పగించింది. తెలంగాణలో మరో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం కీలకం కానుంది.

మాణిక్కం, రేవంత్‌పై సీనియర్ల అసహనం

మాణిక్కం, రేవంత్‌పై సీనియర్ల అసహనం

కాగా, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం.. ఆ తర్వాత గత డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జంబో కార్యవర్గంలో రేవంత్ వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొండా సురేఖ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి సీనియర్ నేతలంతా ఈ నిర్ణయం అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్లను మొత్తానికే పక్కనపెట్టేసి జూనియర్లకు పట్టం కట్టారని మండిపడ్డారు.

మాణిక్కం వెళ్లిపోయారు.. ఇక రేవంత్?

మాణిక్కం వెళ్లిపోయారు.. ఇక రేవంత్?

ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్ పై తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. దీంతో అధిష్టానం ఆదేశాల మేరకు ట్రబూల్ షూటర్ గా దిగ్విజయ్ సింగ్ తెలంగాణకు వచ్చి పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కొంత కొద్ది వారాలకే మాణిక్కం ఠూగర్ స్థానంలో మాణిక్ రావు థాక్రే నియామకం జరగడం ప్రాధాన్యత సంతరించుకున్నారు. అంతేగాక, పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందనుకుంటే తాను తన పదవిని వదులుకునేందుకు సిద్ధమేనని రేవంత్ తాజాగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, మాణిక్కం ఠాగూర్ ను తెలంగాణను నుంచి పంపించడంతో సీనియర్ నేతలు కొంత శాంతించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

English summary
Manikrao Thakre appointed as the state affairs in charge of telangana congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X