Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వణికిస్తున్న చలి, మరో వారం రోజులు గజగజే - జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పే..!!

తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతోంది. రెండు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే దిగువకు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కురుస్తోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకో వడంపై దృష్టి సారించాల్సి ఉంది. జాగ్రత్తలు పాటించకుంటే సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చలిపులి ఇప్పటికే మొదలైంది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-20 డిగ్రీల నుంచి 9-13 డిగ్రీల మధ్యకు చేరుకున్నాయి. అయితే, రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగబోతుంది. అవును.. నవంబరు 11-19 తేదీల వరకు అనగా రాబోయే పది రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

many-districts-recording-minimum-temperatures-reeling-under-severe-cold-wave-conditions

ముఖ్యంగా 13-17 తేదీల మధ్య మరింత అధికంగా ఉంటుందని, కొన్ని జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌ అంటే పది డిగ్రీల లోపు పడిపోనున్నాయని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, విజయనగరం, వైఎస్సార్‌ కడప, ప్రకాశం, అనకాపల్లి, నంద్యాల, పార్వతీపురం మన్యం, పల్నాడు, తూర్పు గోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 నుంచి 20 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టులో 12.7, డుంబ్రిగుడలో 13.7, పెదబయలు లో 13.9, అరకులో 14.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 10 డిగ్రీలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. సోమవారం నుంచి బుధవారం వరకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9-15 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది. ముఖ్యంగా ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 9-10 డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఇక, మిగిలిన జిల్లాల్లో 11-15డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వెల్లడించింది.

ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి సారించాల్సి ఉంది. పిల్లలు, వృద్ధులు ఆరోగ్య సూత్రాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో ఎక్కువగా జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కాలంలో శరీరంలో సరైన రక్త ప్రసరణ జరగక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు నిత్యం వాకింగ్, రన్నింగ్‌ అలవాటు చేసుకోవాలి. ఉదయం పూట వేడి నీరు తాగాలి. సీజనల్‌ పండ్లను తింటే రోగాలబారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. చలికాలంలో శరీరంలో రక్త ప్రసరణ తగ్గి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ఆరోగ్య సూత్రాలు పాటించాలి. మంచు కురిసే వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+