Betting Apps: ఆన్‍లైన్ బెట్టింగ్‍తో నాశనమవుతున్న కుటుంబాలు..
మనం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నామో.. అంతే స్థాయిలో కూడా నష్టపోతున్నాం. టెక్నాలజీని మంచి పనులకు కాకుండా చెడు పనులకు ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి.. భారీగా స్మార్ట్ ఫోన్లు పెరిగిపోయాయి. దీంతో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లు, లోన్ యాప్ లు కూడా భారీగా పెరిగాయి. అలాగే లోన్ యాప్ ల్లో డబ్బులు తీసుకుని వేధింపులు తాళలేక ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు.
చాలా మంది బెట్టింగ్ యాప్ ల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా చిన్నకోడురు మండలం రామునిపట్లలో ఓ కానిస్టేబుల్ ఆన్ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాదు.. భార్య పిల్లల్ని కూడా చంపాడు. ఈ ఘటనతో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కథ మరోసారి తెరమీదకు వచ్చింది. ఆన్ బెట్టింగ్ చేసి చాలా మంది రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. తాజా ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది.

నరేష్ కుటుంబం ఒక్కటే కాదు.. బెట్టింగ్ యాప్ లకు చాలా మంది బలయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా లిగొండ మండలం గొల్నేపల్లిలో ఓ మహిళ ఆన్ లైన్ లో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుంది. గ్రామానికి అవిశెట్టి మల్లేశంకు అతని భార్య రాజేశ్వరీ, కుమారులు, అనిరుధ్, హర్షవర్ధన్ ఉన్నారు. మల్లేశం లారీ డ్రైవర్ గా పని చేస్తుండడంతో వారు చౌటుప్పల్ లోని మల్లికార్జునగర్ లో వారు ఇల్లు అద్దెకు తీసుకుని నివాసిస్తున్నారు.మల్లేశం లారీ డ్రైవర్ కావడంతో ఎక్కువగా బయటే ఉండేవాడు. దీంతో రాజేశ్వరీ పిల్లలతో ఉండేది. ఈ క్రమంలో రాజేశ్వరి తన ఫోన్ లో ఆన్ గేమ్ ఆడాడం అలవాటు అయింది.
ఆమె ఏడాదిగా ఆన్ లైన్ గేమ్ లకు బానిసై.. దాదాపు రూ.8 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఇదంతా ఆమె భర్తకు తెలియకుండా చేసింది. రాజేశ్వరీ ఆ డబ్బంతా తెలిసిన వ్యక్తులు, బంధువుల వద్ద అప్పుగా తీసుకుంది. వారంతా అప్పు తిరిగి చెల్లించాలని కోరడంతో రాజేశ్వరీ ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications