వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దండకారణ్యంలో కరోనా-మరో మావోయిస్టు నేత శారద మృతి-భర్త హరిభూషణ్ మృతి చెందిన 3 రోజులకే

|
Google Oneindia TeluguNews

మావోయిస్టు నేత సమ్మక్క అలియాస్ శారద కరోనాతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నెల 24న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దండకారణ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. అంతకు మూడు రోజుల క్రితమే సమ్మక్క భర్త,మావోయిస్టు అగ్ర నేత హరిభూషణ్ కరోనాతో మృతి చెందారు. కొద్ది రోజుల వ్యవధిలోనే మావోయిస్టు దంపతులు కరోనాతో మరణించడంతో దండకారణ్యంలో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చునన్న ప్రచారం జరుగుతోంది.

మావోయిస్టు నేత శారద ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా ఆమె పనిచేశారు. శారద మృతిపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ... ఆమె అనారోగ్యంతో ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఇకనైనా కరోనా బారినపడిన మావోయిస్టులు లొంగిపోవాలని... వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించారు.

మరోవైపు,మావోయిస్టు పార్టీపై హరిభూషణ్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మృతదేహాన్ని తమకు అప్పగించకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతో కృషి చేసిన హరిభూషణ్‌కు ఇదేనా మీరిచ్చే గౌరవమని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఏ గ్రామంలో ఆయన మృతదేహాన్ని ఉంచినా అంత్యక్రియలు నిర్వహించేవాళ్లమని చెప్పారు.

maoist leader sharada dies of covid 19 days after her husband hari bhushan death

మావోయిస్టులకు పెట్టని కోట అయిన ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చాలారోజులుగా వార్తలు వస్తున్నాయి. మొదట్లో మావోయిస్టు పార్టీ ఈ వార్తలను తోసిపుచ్చింది. ఒకవేళ ఎవరైనా కరోనా బారినపడి మరణిస్తే అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది. చెప్పినట్లుగానే ఇటీవల కరోనాతో మృతి చెందిన మావోయిస్టు అగ్ర నేతలు హరిభూషణ్,భారతక్కల మరణాలపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. హరిభూషణ్ గత కొంతకాలంగా బ్లాంకైటిస్ ఆస్తమాతో బాధపడుతున్నారని.. పరిస్థితి విషమించడంతో జూన్ 21,2021 ఉదయం 9గంటలకు మృతి చెందారని తెలిపింది. అలాగే భారతక్క జూన్ 22 ఉదయం 9:50గంటలకు మృతి చెందినట్లు వెల్లడించింది.

హరిభూషణ్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పరామర్శించిన సంగతి తెలిసిందే. గతంలో దళంలో ఆయనతో కలిసి పనిచేసినప్పటి రోజులను గుర్తుచేసుకుని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. గత నెలలో మావోయిస్టు నేత గడ్డం మధుకర్ కూడా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల వరుస మరణాలు దండకారణ్యంలో కరోనా తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి.

English summary
Maoist leader Sammakka alias Sharada appears to have been killed along with Corona. She was pronounced dead at the scene on the 24th of this month due to poor health. Sammakka's husband, Haribhushan Karona, a top Maoist leader, was killed three days earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X