మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాలు: కరపత్రాల కలకలంతో ములుగు ఏజెన్సీలో రెడ్ అలెర్ట్!!

జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసులు ఎక్కడికక్కడ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో పట్టుకోసం మావోయిస్టు అగ్ర నాయకులు సంచరిస్తున్నారు అన్న సమాచారంతో పోలీసులు చెట్లు పుట్టలను కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలలో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన స్థానిక ప్రజలలో కనిపిస్తుంది.

ములుగు జిల్లాలో మావోయిస్ట్ అమరుల వారోత్సవాల సందర్భంగా రెడ్ అలెర్ట్

ములుగు జిల్లాలో మావోయిస్ట్ అమరుల వారోత్సవాల సందర్భంగా రెడ్ అలెర్ట్

జులై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలు జరగనున్నాయి. నేటి నుండి కొనసాగనున్న మావోయిస్ట్ పార్టీ వారోత్సవాల నేపథ్యంలో ములుగు ఏజెన్సీలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు . నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు అయిన ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మావోయిస్టుల పేరుతో కరపత్రాలు కలకలం

మావోయిస్టుల పేరుతో కరపత్రాలు కలకలం

మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మంగళవారం నాడు వెంకటాపురం సర్కిల్ పోలీసులు ముగ్గురు మావోయిస్టుల సానుభూతిపరులను నిర్బంధించగా, బుధవారం నాడు వెంకటాపూర్ మండలంలో మావోయిస్టుల పేరుతో కరపత్రాలు కలకలం సృష్టించాయి. చత్తీస్ గడ్ దండకారణ్యాన్ని అడ్డాగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు సరిహద్దుల్లో పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

మావోయిస్ట్ ల హిట్ లిస్టులో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నోటీసులు

మావోయిస్ట్ ల హిట్ లిస్టులో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నోటీసులు

పోలీసుల నిర్బంధాలు, ఎన్కౌంటర్ లతో సతమతమవుతున్న మావోయిస్టులు ఈ సారి ఎలాగైనా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తారని అనుమానిస్తున్న పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు. ప్రత్యేక బలగాలతో అడవులను జల్లెడ పడుతూనే, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. పోలీసులు ఇక మావోయిస్టు పార్టీ హిట్ లిస్టులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.

భయం గుప్పిట్లో ఏజెన్సీ వాసులు

భయం గుప్పిట్లో ఏజెన్సీ వాసులు


ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పర్యటనలు చేయవద్దంటూ సూచించారు. రాత్రి వేళల్లో బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇసుక క్వారీల నిర్వహణ సైతం నిలిపివేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. పోలీసుల కూంబింగ్ ఆపరేషన్లతో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+