ఖమ్మం కలకలం: కిడ్నాప్ చేసిన 13మంది విడుదల
ఖమ్మం: చింతూరు మండలం బేగలో కిడ్నాప్‌కు గురైన పదమూడు మంది గిరిజనులు క్షేమంగా ఉన్నారు. బుధవారం నాడు తెల్లవారుజామున మల్లంపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో గిరిజనులను మావోయిస్టులు విడిచి పెట్టారు. ఈ నెల 27న గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్‌కు గురైన గిరిజనులకు మావోలు పలు హెచ్చరికలు చేసినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని, ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని మావోయిస్టులు హెచ్చరించారని సమాచారం.

కాగా, ఖమ్మం జిల్లా సరిహద్దులో మావోయిస్టుల కలకలం చెలరేగింది. చింతూరు మండలం పేగకు చెందిన 13 మంది గిరిజనులను మావోయిస్టులు అపహరించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిని నాలుగు రోజుల క్రితం రాత్రి వారు అపహరించి ఉంటారని వార్తలు వచ్చాయి.
ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటున్నారు. అయితే, ఈ కిడ్నాప్‌ను పోలీసులు ధృవీకరించలేదు. ఒక ఇంటికి చెందిన ఏడుగురు, మరో ఇంటికి చెందిన ఆరుగురిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. తుపాకులతో బెదిరించి తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications