మర్రి శశిధర్ రెడ్డి గుడ్‌బై: ఆ పదవికి: సోనియాకు లేఖ: మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసిన నెక్స్ట్ డే
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటోన్న వరుస పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఉత్కంఠతను రేకెత్తిస్తోన్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ నాయకుడు, మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డిని నియమించినట్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికారికంగా ప్రకటించిన వెంటనే- ఆ పార్టీలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రేవంత్ రెడ్డి నియామకాన్ని సొంత పార్టీ నాయకులే వ్యతిరేకిస్తోన్నారు..తప్పు పడుతున్నారు. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్త జ్వాలలు చెలరేగడానికి దారితీసినట్టు కనిపిస్తోంది.
Recommended Video

మర్రి శశిధర్ రెడ్డి ఆ పదవికి గుడ్‌బై
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన మరుసటి రోజే మర్రి శశిధర్ రెడ్డి.. ఆ కీలక పదవి నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. ప్రకంపలను సృష్టించింది.

2017లో ఏర్పాటైన కమిటీ..
రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించడానికి పార్టీ పరంగా 2017లో అధిష్ఠానం ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో ఏర్పాటైన కమిటీ అది. తొమ్మిది మంది సభ్యులు ఉన్న ఈ కమిటీకి మర్రి శశిధర్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన ఈ కమిటీ ఎన్నికల జాబితాను పర్యవేక్షించడం, ఓటు హక్కు ఉండీ తొలగింపునకు గురైన వారి పేర్లను చేర్చేలా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలను నిర్వహించింది.

కొత్త కమిటీ ఏర్పాటు కావడంతో..
ఈ నేపథ్యంలో- కొత్త ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కావడం వల్ల ఇప్పటిదాకా మనుగడలో ఉన్న పాతవన్నీ రద్దయినట్టే. రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన కొత్త పీసీసీ.. ఇక వాటిని మళ్లీ పునరుద్ధరించాల్సి ఉంటుంది. కొత్త ఛైర్మన్లను ప్రకటించాల్సి ఉంటుంది. దీనికి వీలుగా మాత్రమే తాను తన ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు మర్రి శశిధర్ రెడ్డి తన రాజీనామా లేఖలో వివరించారు. కొత్త ఎన్నికల కమిటీ నియామకానికి రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలనే ఉద్దేశంతో తప్పుకొంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు తాను పూర్తిగా విధేయుడిగానే ఉంటానని, కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తిగా పార్టీలో శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

కేఎల్ఆర్ రాజీనామా..
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును అధిష్ఠానం ప్రకటించిన వెంటనే- ఇక వికెట్లు పడటం ఆరంభమైంది కాంగ్రెస్‌లో. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన ఏఐసీసీ మాజీ అధినేత రాహుల్ గాంధీకి పంపించారు. ఆయన ఏఐసీసీ సభ్యుడు కూడా. పార్టీలో పదవులతో పాటు, తన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తోన్నట్లు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అవకాశాలను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో తాను కొనసాగలేనని మాత్రమే స్పష్టం చేశారు. అందుకే ఏఐసీసీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు తెలిపారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications