అందమైన యువకుల ఫొటోలు: ఒంటరి మహిళలకు ఎర (ఫొటోలు)
హైదరాబాద్: అందమైన యువకుల ఫొటోలను ప్రొఫైల్‌గా మ్యాట్రిమోని సైట్‌లో పెట్టి, ఒంటరి మహిళలను లక్ష్యం చేసుకుని మోసం చేస్తున్న నైజీరియన్ ముఠాలోని మరో ఇద్దరు నిందితులు, వారికి సహకరిస్తున్న ఇద్దరు ఏజెంట్లను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం మీ సేవ బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి నిధులను మళ్లించిన ముఠా కూడా ఇదేనని పోలీసులు భావిస్తున్నారు
శుక్రవారం మీడియా సమావేశంలో సీసీఎస్ జాయింట్ సీపీ ప్రభాకర్‌రావు ఆ వివరాలను అందించారు. సికింద్రాబాదులోని తార్నాకకు చెందిన ఒక మహిళ(54) భర్త చనిపోవడంతో తోడు కోసం భారత్ మ్యాట్రిమొనీ సైట్‌లో ప్రొఫైల్ పెట్టింది. అదే సైట్‌లో నైజీరియాకు చెందిన లెవిస్ అఫ్మెఫున అనే వ్యక్తి తాను చంద్రన్ డేవిడ్ పటేల్, మియామి ఫ్లోరిడాలో బ్రివరేజ్ అపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని, తన వయస్సు 52 అంటూ ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేశాడు. ఇలా వివిధ రాష్ర్టాలకు చెందిన విభాగాల్లో అతడి ప్రొఫైల్‌ను పెట్టి, అందరికీ లైక్‌లు కొట్టాడు. అతడి వలలో నగరానికి చెందిన 54 ఏండ్ల మహిళ పడింది.

తరువాత ఇద్దరూ పరస్పరం పరిచయం చేసుకున్నారు. ఫోన్‌లో మాట్లాడుకున్నారు. నీకు విలువైన బహుమతిని పంపిస్తున్నానని.. దాని క్లియరెన్స్‌కు డబ్బులు అవసరమంటూ రూ.15.62 లక్షలు వరకు వివిధ ఖాతాల్లో జమ చేయించాడు. మోసపోయినట్లు గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు ప్రధాన నిందితుడు లెవిస్ అఫ్మెపునను అరెస్టు చేశారు.
బ్యాంకు లావాదేవీలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మిగతా నిందితుల ఆచూకీ లభ్యమైంది. ఇందులో నైజీరియాకు చెందిన ఇగ్‌బుటె కింగ్స్‌స్లే ఉచ్‌క అలియాస్ టోని, క్రిష్, ఇతని సోదరుడు ఇగ్‌బుటె జుడె నవాబులర్, వారికి సహకరించిన బీహర్‌కు చెందిన సంతోష్‌కుమార్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దీరేంద్రకుమార్ అలియాస్ ధనుష్, రహుల్ పాండేలను డిల్లీలో అదుపులోకి తీసుకొని ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. ఈ ముఠాకు చెందిన జేమ్స్, ప్రవీణ్‌సింగ్, మహేష్‌కుమార్ తివారీ, నికిల్ శర్మ, సమీర్ గుప్త, సునీల్‌కుమార్, సందీప్ మిశ్ర, లలిత్, అశోక్ సింగ్‌లు పరారీలో ఉన్నారు.

ఢిల్లీ పరిసర ప్రాంతాలను అడ్డాగా చేసుకొని నైజీరియన్లు ప్రధాన సూత్రధారులుగా మ్యాట్రిమొనీ మోసాలు జరుగుతున్నాయి. ఉగ్వాంగ్ లెవిస్ అఫ్మెఫున, టోని, జేమ్స్ ప్రధాన నిందితులు. వీరికి నవాబులర్ సహకరిస్తుంటాడు. వీరికి బ్యాంకు ఖాతాల అవసరం ఉండటంతో ఏజెంట్లను నియమించుకుంటారు. వీరికి బ్యాంకులో డిపాజిట్ అయ్యే నగదులో 10 నుంచి 15 శాతం కమిషన్ ఇస్తారు.
రాహుల్ పాండే, సంతోష్‌కుమార్, మహేశ్‌కుమార్, ప్రవీణ్‌సింగ్ ఏజెంట్లు. వీరు స్థానికుల చిరునామాలతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తుంటారు. బాధితులు పంపిన డబ్బులో వీరికి 3 శాతం కమిషన్ అందుతుంది. నైజీరియన్లు అమాయకులను మోసం చేసి డబ్బులు లాగుతారు. వారు డిపాజిట్ చేసిన నగదును ఖాతాదారులు మధ్యవర్తులకు ఇవ్వడంతో, ఏజెంట్లు వాటిని నైజీరియన్లకు చేరవేస్తారు. ఇలా మూడు విభాగాలుగా విడిపోయి ఈ మోసాల్లో పాలు పంచకుంటున్నారని జాయింట్ సీపీ వివరించారు.
మూడు నెలల క్రితం మీ సేవకు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. అందులో కొంత నగదును ఇతర ఖాతాలోకి వెళ్లకుండా సైబర్ క్రైమ్ పోలీసులు నిలువరించారు. ఇక్కడ బదిలీ అయిన నగదు రాహుల్ పాండే ఖాతాలోకి చేరింది. ఇతడు బ్యాంకు ఖాతా తెరిచిన పది రోజుల వ్యవధిలోనే రూ. 44 లక్షల డిపాజిట్లు జరిగాయి. ఇతడిని 2013లో నగర సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

అప్పట్లో ఈ మెయిల్స్ హ్యాక్ చేసి భారీగా నగదును ఇతర ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు కుట్ర పన్నారు. వాణిజ్య సంస్థలకు బ్యాంకు అధికారులు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఈ కుట్ర బయటపడింది. రాహుల్ పాండేను విచారిస్తే మీ సేవ కేసులో మిగతా నిందితులను కూడా పట్టుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 300 మంది వరకు నైజీరియన్లు ఇలా మోసాలకు పాల్పడుతూ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు.
నలుగురిని అరెస్టు చేసి వీరి నుంచి రూ.1.38 లక్షల నగదు, 350 అమెరికా డాలర్లు, 9000 నైజీరియన్ కరెన్సీ నిరోస్, పది సెల్‌ఫోన్లు, మూడు నెట్ కనెక్టెడ్ డాటాకార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సైబర్ క్రైమ్స్ ఏసీపీ అనురాధ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ బృందం బాగా పనిచేసిందని వారిని అభినందించారు. సీపీ నుంచి వారికి రివార్డులు ఇప్పించనున్నట్లు తెలిపారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications