ఆస్ట్రేలియా కబడ్డీ జట్టు కోచ్‌గా తెలుగు వ్యక్తి: ఎవరీ శ్రీనివాసరెడ్డి?

హైదరాబాద్: తెలుగు జాతికి చెందిన ఓ వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన ఘనత దక్కింది. తెలంగాణకు చెందిన మాజీ అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డికి ఆదేశ కబడ్డీ జట్టుకు శిక్షణ ఇచ్చే అరుదైన అవకాశం దక్కింది. మెదక్ జిల్లా కొండాపూర్ మండలం ఉత్తర్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆస్ట్రేలియా కబడ్డీ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యాడు.

ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు శ్రీనివాస్‌ రెడ్డి అసిస్టెంట్ కోచ్‌గా పని చేశారు. గతంలో దక్షిణ కొరియా జట్టుకు కూడా అసిస్టెంట్ కోచ్‌గా సేవలందించారు. అంతేకాదు గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్లలో భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

 Medak district srinivas reddy as appointed australia kabaddi coach

కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రపంచ కప్ కబడ్డీ పోటీలు అక్టోబర్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. ఈ పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లుకు శ్రీనివాస్ రెడ్డి శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే తాను ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు తెలిపారు.

ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో ఆ జట్టు విజయానికి తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. క్రికెట్‌ను ఎక్కువగా వీక్షించే ఆస్ట్రేలియాలో కబడ్డీకి ఆదరణ పెరిగేలా కృషి చేస్తానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+