మేడారం జాతర 2024: పైసా ఖర్చులేకుండా అమ్మవార్లను దర్శించుకునే ఏకైక జాతర!!
పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం జాతర అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గతంలో మేడారం జాతరకు కాలినడకన వచ్చేవారని కానీ ఇప్పుడు మేడారం జాతరకు బస్సులు, హెలికాప్టర్లతో సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశారని, మేడారం జాతరకు కూడా మహిళలు ఈ ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.
గతంలో కంటే మేడారం జాతరకు డబల్ బస్సులు వేసినట్టు తెలిపారు. ఈసారి 6000 బస్సులను ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈరోజు మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. మంత్రి సీతక్క తో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్ తదితరులు పాల్గొన్నారు.

బస్ టికెట్ కౌంటర్స్, క్యూ లైన్స్ ను రిబ్బన్ కట్ చేసి మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ లు ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క మేడారం జాతరకు కావలసిన అతి ముఖ్యమైన రవాణా వ్యవస్థను ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు, అధికారులకు నా విన్నపం అంటూ పేర్కొన్న సీతక్క ఓపికతో బస్సులు నడపండి, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని కోరారు.
ఆడుతూ పాడుతూ పనిచేయాలన్నారు. ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలని, నేటి నుండి ఆర్టీసీ బస్సులు మేడారానికి అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా నేడు మేడారం సమ్మక్క-సారక్క అమ్మవార్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హార్కరా వేణుగోపాల్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తులాభారం వేసి నిలువెత్తు బంగారం తల్లులకు సమర్పించుకున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ను అడిగి తెలుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ అలియాస్ సీతక్కను ఆయన కలిశారు












Click it and Unblock the Notifications