ప్రీతి ఆత్మహత్య కేసు: నిందితుడి సైఫ్‌కి మరో షాక్
వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) మొదటి సంవత్సరం పీజీ విద్యార్థిని ధారావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్న నిందితుడు సైఫ్‌పై ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చింది. సైఫ్ పై గతంలో విధించిన సస్పెన్షన్ కాలం ఈ ఏడాది మార్చి 3వ తేదీతో ముగస్తుండగా.. మరో 97 రోజులపాటు పొడిగించింది.
గత ఏడాది ఫిబ్రవరి 22న సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో ప్రీతి ఎంజీఎం ఆస్పత్రిలో ఆత్మహత్యకు యత్నించింది. అదే నెల 26న హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు సైఫ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఏడాదిపాటు అతడు తరగతులకు రాకుండా వేటు వేస్తూ.. కేఎంసీ ర్యాగింగ్ నిరోధక కమిటీ నిర్ణయం తీసుకుంది.

సైఫ్ హైకోర్టును ఆశ్రయించగా.. తాత్కాలికంగా సస్పెన్షన్ ఎత్తివేసింది. గత నవంబర్ 9న హైకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. సైఫ్ హాజరై వివరణ ఇచ్చాడు. దీనిపై చర్చించిన కమిటీ సభ్యులు.. సైఫ్‌పై ఆరోపణలు వాస్తవమేనని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కమిటీ విధించిన సస్పెన్షన్ ను కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
రేణుశ్రీ ఆత్మహత్య కేసును సుమోటాగా తీసుకున్న ఎన్‌హెచ్ఆర్సీ
సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం వర్సిటీకి చెందిన విద్యార్థిని రేణుశ్రీ ఆత్మహత్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ కేసును సమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్ఆర్సీ.. తెలంగాణ సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. విద్యార్థిని ఆత్మహత్యపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పోలీసుల విచారణ, సంఘటనకు బాధ్యులైనవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని పేర్కొంది. జనవరి 5న తాను చదువుతున్న గీతం వర్సిటీ భవనంపైనుంచి దూకి రేణుశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది.












Click it and Unblock the Notifications